# ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోని సీజ్ చేయాలి…
# ప్రవేట్ ఆస్పత్రులకు తొత్తులుగా మారిన వైద్యశాఖ అధికారులు..
# వైద్యశాఖ అధికారుల అండదండలతో ప్రవేట్ ఆసుపత్రుల దందా..
# సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్.
నర్సంపేట,నేటిధాత్రి :
వైద్యం పేరుతో నర్సంపేట పట్టణంలో కొన్ని ప్రవేట్ హాస్పటల్లో చేస్తున్న దోపిడిని అరికట్టాలని సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ డిమాండ్ చేశారు.సీపీఎం పట్టణ కమిటీ సమావేశం పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పటల్స్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కనీస నిబంధనలను పాటించకుండం , ధనార్జిని ధ్యేయంగా వ్యవహరిస్తున్నాయని, వైద్యం కోసం హాస్పిటల్ కి వచ్చిన పెషేంట్లను నిలువు దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఇష్టానుసారంగా పరీక్షలు, స్కానింగ్, అడ్మిట్ పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.ఫీజుల వివరాలు నోటీస్ బోర్డులో పెట్టాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ అవి పాటించడం లేదని,కొన్ని ఆసుపత్రులలో నోటీసు బోర్డులో డిస్ప్లే చేసినప్పటికీ ఫీజుల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు కొన్ని ప్రవేట్ హాస్పిటల్స్ పిఆర్వోలను పెట్టుకుని ఆర్ఎంపీల దగ్గరికి వెళ్లి మా హస్పటల్స్ కు పేషంట్లను పంపిస్తే మీకు కమిషన్ అందిస్తామని చెప్పి ఆర్ఎంపీల ద్వారా వచ్చిన పేషెంట్ల దగ్గర నిలువు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందన్నారు.కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ మేనేజర్ల పేర్లతో నిర్వహణ చేస్తున్నారని వాటికి ఎలాంటి గుర్తింపు లేదని హస్పటల్ నిర్వహణకు ఉండవలసిన బిల్డింగ్స్, ఫైర్ సేఫ్టీ పార్కింగ్ స్థలాలు లేవని వాహనాలను రోడ్లమీదనే పార్కింగ్ నిర్వహిస్తున్నారని అన్నారు.అవసరం లేకున్నా టెస్టుల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని హాస్పటల్లోనే మెడికల్ షాపు నిర్వహించడం వల్ల డాక్టర్లు రాసిన కంపెనీ మెడిసిన్స్ మా హాస్పిటల్ లోనే తీసుకోవాలని ఒత్తిడి తెస్తూ హాస్పటల్ కి ఆపదలో వచ్చే పేషెంట్ల దగ్గర నుండి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ జరుగుతున్న జిల్లా వైద్యశాఖ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తూ ప్రైవేటు ఆసుపత్రులకు తొత్తులుగా వివరిస్తున్నారని ఆరోపించారు.నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు హాస్పటల్ లపై చర్యలు తీసుకోకుండా వారికి సహకరిస్తున్నారని శ్రీధర్ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు హాస్పటలపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని హాస్పటల్ ల ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు కందికొండ రాజు,నాయకులు కలకోట అనిల్, జగన్నాధం కార్తీక్, తోటకూరి రాజేష్, నరేష్, కొండి మల్లయ్య, నర్సింహా రాములు తదితరులు పాల్గొన్నారు.