కమ్యూనిస్టులను గెలిపించిన శ్రీలంక ప్రజలకు జేజేలు: సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

నల్లగొండ జిల్లా,నేటి ధాత్రి:
శ్రీలంకలో కమ్యూనిస్టులకు అఖండ మెజార్టీ చేకూర్చి అధికారంలోకి తీసుకొచ్చిన శ్రీలంక ప్రజలకు జేజేలు అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.బుధవారం గట్టుపల్ మండల పరిధిలోని వెల్మకన్నె గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ21వ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రారంభ సూచికగా సిపిఎం జెండాను సిపిఎం సీనియర్ నాయకులు టి.గోపాల్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, తప్పుడు ఆర్థిక విధానాలతోశ్రీలంక ప్రజల జీవితాలనుకష్టాల్లోకి,కడగండ్లకు గురిచేసిన గత ప్రభుత్వ విధానాలనునిరసిస్తూ, మార్క్సిస్టు విధానాల వలన మా బ్రతుకుల్లో మార్పు వస్తుందని గొప్ప ఆశ భావంతో మార్పిస్టు నాయకుడైన అనురకుమార దిశన్నాయకే గెలిపించారని, శ్రీలంకలోప్రజల తీర్పు చాలా సంతోషకరమనిఆయన అన్నారు.మనదేశంలోబిజెపి అనుసరిస్తున్నవిధానాల ఫలితంగానిత్యవసర వస్తువుల ధరలపెరిగి ప్రజలకు మోయలేని భారంగాతయారైందన్నారు.నిరుద్యోగం ఎన్నడూ లేనివిధంగా9.2 శాతానికి పెరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రజలకు మరిన్ని కష్టాలు తీసుకువచ్చిందన్నారు.ప్రజలపై బారాలు మోపుతూ, కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూరుస్తున్నారని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో మిగిలిన వాటిని కూడాఅమలు చేయాలన్నారు.రెండు లక్షల రుణమాఫీ కూడాఅందరికీ వర్తింపజేయాలని, పంటల బీమా పథకానికి చెల్లించాల్సిన ప్రీమియం ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు.ఒకే దేశం_ ఓకే ఎన్నిక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం సరైనది కాదని ఆయన అన్నారు.జమిలి ఎన్నికల విధానం రాజ్యాంగ స్పూర్తికివిరుద్ధమని,దేశంలోబిజెపి మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఉన్నంత స్థాయి కమిటీ ఒకే దేశం_ ఓకే ఎన్నిక తీసుకురావడం వల్ల దేశంలో ఐక్యతకు ఫెడరల్ స్ఫూర్తి కి విఘతం కలిగి అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం, సిపిఎం గట్టుప్పల మండల కార్యదర్శికర్నాటి మల్లేశం,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులుచాపల మారయ్య,సిపిఎం చండూరు మండల కార్యదర్శిజెర్రిపోతుల ధనుంజయ గౌడ్, సిపిఎం గట్టుపల మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్,సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిటేకుమెట్ల కృష్ణ,పార్టీ నాయకులు పెట్టుగల అబ్బయ్య, పడసబోయిన యాదగిరి, సిక్కుల సైదులు, బుచ్చయ్య, దాసరి నరసింహ, బి.పుల్లయ్య, వరికుప్పల నరసింహ, తదితరులుపాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version