ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన కోసరి సంజన , వయస్సు,17, సంవత్సరాలు,పదో తరగతి వరకు చదువుకొని ఇంట్లో వారు చదివించే స్తోమత లేక మధ్యలో చదువు కూడా ఆపేసింది.అమ్మ లక్ష్మి , నాన్న,తిరుపతి, అన్నయ్య కూలి, పనిచేస్తాడు. తండ్రి పశువుల కాపరిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఏలాంటి ఆస్తి కూడా లేవు. సంజన అనే అమ్మాయికి ఐదు నెలల నుంచి బ్లడ్ లో ఇన్ఫెక్షన్ వల్ల రెండు కాళ్ళు చేతులు పనిచేయట్లేదు. మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్ లో మరియు కరీంనగర్ హాస్పిటల్ లో అప్పుచేసి ఇప్పటివరకు 3.లక్షలు ఖర్చు చేశారు. అయినా కూడా ఇప్పటి వరకు ఈ అమ్మాయికి కొంచెం కూడా ఆరోగ్యం కుదుటపడలేదు. వైద్య ఖర్చుల కొరకు చాలా డబ్బు అవసరమని డాక్టర్లు చెప్పారు.ఈ పాప వాళ్ళది చాలా నిరు పేద కుటుంబం . ప్రతిరోజు కూలి చేసుకుంటే గానీ రోజు పూట గడవని పరిస్థితి కావున ఈ పాపకి కనీసం మాములు వైద్యం చేయించే స్థోమత కూడా లేదు కావున దాతలు ఎవరైనా దయతలచి ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఫోన్ పే నెంబర్ 7670899377 కోసరి సంజయ్. ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులే మిన్న మనం చేసే ఒక రూపాయి సహాయం వల్ల ఆ పాప ఆరోగ్యం బాగైతే ఆ సంతోషమే వేరు దయచేసి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయండి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version