ఆదివాసి హక్కుల కోసం ఐక్యతతో పోరాడుదాం.

ఆదివాసి హక్కుల కోసం ఐక్యతతో పోరాడుదాం.

పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి.

తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్.

ఖమ్మం జిల్లా అధ్యక్షులు గా బచ్చల వెంకటేశ్వర్లు.ఎన్నిక

కారేపల్లి నేటిధాత్రి

సింగరేణి మండల కేంద్రంలో తుడుం దెబ్బ ఆదివాసి హక్కుల పోరాట సమితి సమావేశంలో పాల్గొన్న జాతీయ రాష్ట్ర జిల్లా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో అందరి అభిప్రాయాల మేరకు ఏకగ్రీవంగా కమిటీ ఎన్నిక నిర్వహించారు.ఎన్నికల అధికారులుగా జాతీయ అధ్యక్షులు ఈసం సుధాకర్ ఉపాధ్యక్షులు కోడెం వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కుమార్ కార్య నిర్వాహక అధ్యక్షులు ముక్తి రాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోడం రామ్మూర్తి రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణరావు పాల్గోని రాష్ట్ర కోశాదికారి కల్తీ రాంప్రసాద్ అధ్యక్షతన కమిటీ ఎన్నిక చేశారు.అనంతరం వారుమాట్లాడుతు ఎస్టి జాబిత నుండి లంబాడీలను తొలగించాలని ఆదివాసీలకు న్యాయం జరిగే విధంగా అందరూ కలిసికట్టుగా ఉద్యమించి పోరాటం చేయాలని ఆదివాసి హక్కులను కాపాడుకోవాలని లంబాడీల వలసల వలన ఆదివాసుల అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని అన్ని రంగాల్లో ఆదివాసులు అణచివేతకు గురికా బడుతున్నారని ఆదివాసి ప్రాంతాల్లో సైతం లంబాడీలు అధిపత్యాని చెలాయిస్తున్నారని.దినికి పాలక ప్రతిపక్షలు అయిన కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి పార్టిలు వారికి వత్తాసు పలుకు తున్నాయని లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలంటే ఆయా పార్టీల మద్దతు ఎంతో అవసరమని దాన్ని కూడగట్టుకొని మనందరం సమిష్టిగా కలిసి కట్టుగ పోరాటాన్ని ఉదృతం చేసి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే విధంగా ఆయా పార్టీల్లో ఉన్న ఆదివాసీల నాయకులు ఉద్యమించి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేంతవరకు నాయకులపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ఆలంబిస్తున్న విధానాల్నె కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలంబిస్తుందని సింగరేణి మండలం లోని గుట్ట కింద గుంపు చీమలపాడు పరిసర ప్రాంతాల్లోని గుట్టలను తవ్వి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని అక్రమంగా టిప్పర్ లో మట్టి తోలకాలు ఏదేచగా కొనసాగిస్తూ లక్షల కొద్ది సొమ్ము జమ చేసుకుంటున్నారని ఏజెన్సీ ప్రాంతాల్లో వనరులను పరాయికరణ చేస్తూ దోచుకుంటున్నారని దాన్ని ఆపకుంటే తుడుం దెబ్బ పోరాటం చేస్తుందని. పోడు భూములకు పట్టాలి ఇవ్వాలని ఆదివాసీల హక్కులను కాపాడుకొనుట కొరకు ఆదివాసులు ఉద్యమిస్తారని ఆయన తెలిపారు. నూతన కమిటీ ఖమ్మం జిల్లా
అధ్యక్షులు బచ్చల వెంకటేశ్వర్లు.
కార్యనిర్వాహణ అధ్యక్షులు పూనెం శివరాం.
ప్రధాన కార్యదర్శి తెల్లం సురేష్.
ఉపాధ్యక్షులు
గోగ్గల బుచ్చిరాములు
పూసం భద్రం.
మీసాల రాంబాబు.
కార్యదర్శులు
గలిగా సమ్మయ్య.
పొడుగు హరీష్.
ప్రచార కార్యదర్శి
బుగ్గ సురేందర్ (కారేపల్లి)
కోశాదికారి బొమ్మల కృష్ణమూర్తి.
ముక్తి కోటేశ్వరరావు.
అధికార ప్రతినిధి
ఈసల వెంకన్న (కారేపల్లి) వాసం శ్రీకాంత్ (ఏన్కూర్)
రాష్ట్ర కమిటీ కార్యదర్శి తాటి రామారావు.
జాతీయ ఉపాధ్యక్షులు ఈసం వంశీకృష్ణ
ఖమ్మం డివిజన్ కమిటీ
అధ్యక్షులు ఉండం శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి బర్ల వినోద్ కుమార్.
ఉపాధ్యక్షులు
సోది కోటేశ్వరరావు
గుంపెన పెళ్లి శ్రీను.
కార్యదర్శి బొల్లి అప్పారావు
ఆదివాసి విద్యార్థి సంఘం ఖమ్మం జిల్లా.
జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదల పల్లి శ్రీనివాస్.
వర్కింగ్ ప్రెసిడెంట్ కుంజా సురేష్.
ఉపాధ్యక్షులు కల్తీ పాండు లను ఎన్నిక చేయనైనది.ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version