అమరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల స్ఫూర్తిని వెలుగెత్తి చాటుదాం…

అమరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల స్ఫూర్తిని వెలుగెత్తి చాటుదాం

కాంపాటి పృధ్వీ,పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్ వి రాకేష్,పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు

గుండాల,నేటిధాత్రి :

స్థానిక గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో అమరుల యాదిలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ), ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీలు మూడు రోజులపాటు మార్చి 23, 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్న స్ఫూర్తి యాత్ర ప్రారంభమైంది. ప్రారంభ సభలో పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృధ్వీ, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వి రాకేష్ మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల స్ఫూర్తితో సామ్రాజ్యవాద అమెరికా యుద్ధోన్మాద చర్యలు నిరసిస్తూ, భారత్ అమెరికాతో చమురు వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఆపాలని,ప్రపంచ శాంతిని వెలుగెత్తి చాటుతూ ఐక్యంగా పోరాడాలన్నారు. విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని అన్నారు. ప్రతీయేటా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, ఐదేళ్లలో రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోడీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా కమిషన్ సిఫారసులను పునః పరిశీలించాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రించాలని కోరారు. నేటికీ భగత్ సింగ్, రాజ్ గురు,సుఖుదేవ్ లు అమరులై 95 ఏండ్లు కావొస్తుందనీ, నేటి వారి మార్గం అనుసరణీయమని అన్నారు. అమరుల స్ఫూర్తితో ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణకై కొట్లాడాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి శాంతారావు, పివైఎల్ జిల్లా అధ్యక్షులు పి మంగన్న,పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షులు బి‌ వీరభద్రం, జిల్లా కార్యదర్శి మునిగెల శివప్రశాంత్, పివైఎల్ మండల కార్యదర్శి శ్రావణ్, పిడిఎస్ యూ జిల్లా నాయకులు శ్రావణి, వాసు, అఖిల్, పివైఎల్ నాయకులు కుంజ ధర్మరాజు, వాగబోయిన మోహన్ రావు, పోతయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version