నాయకులారా ఇదేం పాడుపద్ధతి! డ్రగ్స్ పార్టీలేమిటి!?

`ఓ వైపు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ చైతన్యం కలిగిస్తోంది.

`”సిఎం రేవంత్ రెడ్డి” డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయాలని పట్టుదలతో వున్నారు

`పోలీస్ శాఖ శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది

`ఈగల్ టీమ్ ఏర్పాటుతో డేగ కళ్ళతో చూస్తూనే వుంది

`ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది.

`అవేర్ నెస్ కార్యక్రమాలు అనేకం చేస్తూనే వున్నారు.

`డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణా ను తీర్చి దిద్దాలని పని చేస్తున్నారు.

`నాయకులే ఇలా దొరికితే సమజానికి ఏం సంకేతాలు పంపుతున్నట్లు?

`నాయకులే ఇలా ప్రవర్తిస్తే వారి పిల్లలు నేర్చుకోరా?

`రేపటి తరం కూడా చెడిపోదా?

`ఏ పార్టీ నాయకులయినా సరే ఆదర్శనంగా లేకపోతే ఎలా?

`ప్రజా ప్రతినిధులుగా ఎలా అర్హులైతారు?

`డ్రగ్స్ కేసుల్లో దొరికే నాయకులను పార్టీలు బహిష్కరించాలి?

`ఎన్నికల కమిషన్ జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి?

`అప్పుడే నాయకులకు భయం వుంటుంది?

`కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకులకు వణుకు పుడుతుంది?

`ఫామ్ హౌజులు..పార్టీలు? మాదక ద్రవ్యాలు?

`నాయకులు..మత్తు పదార్థాలు.

`ఎక్కడికి పోతుంది ఈ సమాజం!

`అమాయక యువత డ్రగ్స్ అలవాటు చేసుకుంటున్నారు?

`డ్రగ్స్ కు బానిసలౌతున్నారు బలై పోతున్నారు?

`జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

`డ్రగ్స్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత నాయకులకు లేదా?

`ప్రజా ప్రతినిధులుగా ఆ బాధ్యత మాది కాదనుకుంటున్నారా?

`తెలియని వారు తప్పు చేస్తే బుద్ది చెప్పి మార్చొచ్చు?

`తెలిసీ తప్పు చేసిన వారికి శిక్ష పడితేనే సమాజంలో భయం పుడుతుంది?

 

హైదరాబాద్, నేటిధాత్రి:                                                        

ఎటు పోతుందీ సమాజం. ప్రజలకు ఆదర్శంగా, వారి జీవితాలను తీర్చిదిద్దే స్దానంలో వున్న నాయకులు మత్తు పదార్ధాలకు అలవాటు పడడం ఏమిటి? మాదక ద్రవ్యాలను వినియోగించడం ఏమిటి? ప్రజా జీవితంలో సమాజానికి తలవంపులు తెచ్చే పనులు చేయడమేమిటి? ఫామ్ హౌజ్‌ల సంస్కతి ఏమిటి? ప్రశాంతమైన జీవినం కోసం నిర్మాణం చేసుకున్న ఫామ్ హౌజ్‌లలో ప్రైవేటు పార్టీలు ఏర్పాటు చేసుకోవడమేమిటి? అందులో గ్రడ్స్ వినియోగించడమేమిటి? కొంత మంది నాయకులు ఎటు వెళ్తున్నారు? సమాజాన్ని ఎటు వైపు తీసుకెళ్తామనుకుంటున్నారు. మన దేశంలో డ్రగ్స్ వినియోగం చట్టరిత్యా నేరం. డ్రగ్స్ తీసుకోవడం తప్పని నాయకులకు తెలుసు. నేరమని కూడా తెలుసు. ప్రజలు తీసుకుంటే నేరం..మేం తీసుకుంటే నేరం కాదనుకుంటున్నారా? డ్రగ్స్ అనేది వ్యసనమే కాదు, ఆరోగ్యానికి హాని కరం. ఒక్కసారి దానికి బానిక అయితే దాని వలయం నుంచి తప్పించుకోవడం సాద్యం కాదని తెలుసు. నాయకులే డ్రగ్స్‌కు అలవాటు పడడం సమాజానికి హనికరమని తెలుసు. తెలిసి తెలసి నాయకులు తప్ప్పు చేయడం ఎవరికీ క్షమార్హంకాదు. సమాజానికి అసలే మంచిది కాదు. ఒకప్ప్పుడు బాగా సంపాదనపరులు, నాయకులు తమ పుట్టిన రోజు వేడుÅ£లు పెద్ద పెద్ద ీVAటళ్లలో చేసుకోవడం గొప్పగా భావించేవారు. సమాజంలో తమ పరపతిని చూపించుకునేవారు. కాని వ్యసనాలు అలవాటు చేసుకున్న కొంత మంది నాయకులు, సమాజంలో కొద్దో గొప్ప పేరు, పరపతి సంపాదించుకున్న వారు, వ్యాపార వేత్తలు ఫామ్ హౌజ్‌లలో ప్రైవేటు పార్టీలు చేసుకోవడం ఇప్ప్పుడు ట్రెండ్‌గా మారింది. అందులోనూ గ్రడ్స్, విదేశీ మద్యాల వినియోగంతో అతి ఖరీదైన పార్టీలు చేసుకోవడం గొప్ప ఫ్యాషనైపోయింది. కాని తాము తప్ప్పు చేస్తున్నామన్న భావన వారిలో లేకుండాపోతుంది. నేరం చేస్తున్నామన్న భయం కూడా లేకుండాపోతోంది. ఇప్పటికే పబ్ కల్చర్ వచ్చిన తర్వాత తెలంగాణలో యువత అనేక వ్యసనాలకు గురౌతున్నారు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. మంచి వాళ్లు కూడా అలవాటు చేసుకుంటున్నారు. అలా యువతను కొంత మంది డ్రగ్స్ అమ్మకం దారులు, అదే వ్యాపారంగా గుట్టు చప్ప్పుడు కాకుండా అమ్ముకునేవారు యువతను టార్గెట్ చేస్తున్నారు. అలా ఎంతో మంది యువత పెడ దారిలో పడుతున్నారు. అలాంటి వారిని చైతన్యం చేసి, సమాజాన్ని మంచి దారిలో పెట్టాల్సిన అవసరం రాజక¡య వ్యవస్ధకు వుంది. ఎందుకంటే ఎంత మంది మేధావులు చెప్పినా, ఎంత కఠినమైన చట్టాలు అమలు చేసినా, రాజకీయ వ్యవస్ధ చెప్పే మాటలు జనంలోకి బాగా వెళ్తాయి. నాయకులు చెప్పింది జనం ఆచరిస్తారు. పాటిస్తారు. అనే నమ్మకం కూడా మన సమాజంలో బలంగా వుంది. ఎందుకంటే ఒక నాయకుడు మంచి నడవడికతో వుంటే ఆయన అనుచరులు కూడా అదే బాటలో నడుస్తారు. అదే నాయకుడు వ్యసన పరుడైతే, డ్రగ్స్ తీసుకునే వ్యక్తి అయితే తాము కూడా తీసుకోవాలి అనుచరలు కూడా ఆలోచిస్తారు. వారు కూడా దానికి బానిసలౌతారు. ఇలా కొంత మంది నాయకుల మూలంగా వ్యవస్ధ మొత్తం చెడిపోతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైనా డ్రగ్స్ ప్రీ స్టేట్ చేయాలని సిఎం. రేవంత్ రెడ్డి తొలి రోజు నుంచి పట్టుదలతో వున్నారు. అనేక సార్లు ఈ విషయంపై ఆయన ప్రజలకు సూచన చేశారు. అదికారులతో రివ్యూలు చేశారు. డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపుతున్నారు. అందుకు ఏర్పాటైన ఈగల్ టీమ్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే సమస్యే లేదని సిఎం. రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. అయినా ప్రజా ప్రతినిధులే ఇలాంటి పార్టీలు చేసుకోవడం సమాజానికే తలవంపులని చెప్పకతప్పదు. రాజకీయ నాయకులు దొరికినంత మాత్రాన దీన్ని ఎవరూ రాజకీయం చేయెద్దు? రంద్రాన్వేషణలు చేయొద్దు? రాజకీయ కక్షలంటూ సొల్లు పురాణాలు ఎవరూ చెప్పొద్దు. డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టమైన ఆదారాలు పోలీసులు సేకరించారు. వారు డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా వెల్లడైంది. దాన్ని పోలీసు శాఖ కూడా దవీకరించింది. అయినా ఇందులో రాజకీయాలు మాట్లాడానికి ఏమీ లేదు. చట్టం తన పని తాను చేసుకుపోనివ్వాలి. ఇందుకోసం ఏర్పాటైన ఈగల్ టీమ్‌కు ప్రభుత్వం పూర్తి స్వేచ్చనిచ్చింది. ఓ నాయకుడికి ఒకలా, మరో నాయకుడికి మరోలా అని లేని పోని రాజకీయ లెక్కలు చెప్ప్పుకోవడం కూడా సిగ్గు చేటు. అసలు ఆ పామ్ హౌజ్‌లో అసాంఘీక కార్యకలాపాలు నిర్వహించడమే నేరం. అలాంటప్ప్పుడు ఇందులోకి రాజకీయాలు జొప్పించడం కూడా సమాజానికి ఎంత మాత్రం మంచిదికాదు. ఆయా రాజకీయ పార్టీలకు అసలే మంచిది కాదు. ప్రజలు ఆయా పార్టీల మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం కూడా వుంది. ప్రజలు చాలా సులువుగా మర్చిపోతారని అనుకుంటే పొరపాటు. పైగా ప్రతిపక్షంలో వున్న పార్టీలు ఎంతో జాగ్రత్తగా వుండాలి. ప్రజాపక్షం నిలిచే నాయకులు తప్ప్పులు చేయకుండా ఆదర్శంగా వుండాలి. ఇలాంటి దుష్టపనులు చేస్తే పాలకపక్షం ఊరుకుంటుందా? చట్టం చూసి చూడనట్లు వదిలేస్తుందా? ఈ మాత్రం సోయి లేకుండా నాయకులు వ్యహరిస్తారా? ఇది బాద్యతారాహిత్యం కాదా? అది ఏ పార్టీ నాయకుడైనా సరే అలాంటి నాయకులను పార్టీలో వుండన్వికూడదు. ఏ పార్టీ అలాంటి నేతలను పార్టీలు దగ్గర తీయొద్దు. వారికి ఎన్నికల్లో అవకాశాలు కల్పించొద్దు. అంతే కాదు ఎన్నికల సంఘం కూడా అలాంటి నాయకులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదం విధించాలి. అలా చేస్తే తప్ప నాయకులు మారరు. అయినా నాయకులే ఇలా డ్రగ్స్ సేవించి పట్టుబడితే ఆ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు? వారి పిల్లలు ఎలా తయారౌతారన్న సోయి కూడా వుండదా? రేపటి రోజు వారి పిల్లలు నాయకులైతే ఇదే ఆదర్శంగా తీసుకోరా? నాయకులే ఇలా డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిస్తే వారి పిల్లలు నేర్చుకోకుండా వుంటారా? పరోక్షంగా వారి పిల్లలకు నాయకులే దగ్గరుండి నేర్పుతున్నారా? ఏమనుకోవాలి? ఓ వైపు ఈగల్ టీమ్ రాత్రనక, పగలనక డ్రగ్స్ నివారణ కోసం పనిచేస్తోంది. ఎక్కడా డ్రగ్స్ లేకుండా చూసుకుంటుంది. యువత పెడ దారిలో పడకుండా చూసుకుంటోంది. మరో వైపు ప్రభుత్వం ప్రజలను చైతన్యం చేసేందుకు అనేక రకాలుగా ప్రచారం చేస్తోంది. ప్రజలను చైతన్యం చేయడంకోసం అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహస్తోంది. అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సామాజిక బాద్యత కల్గిన నాయకులే పోలీసుల కళ్లు గప్పి డ్రగ్స్ పార్టీలు చేసుకోవడం అంటే సమాజానికి తప్ప్పుడు సంకేతం కాదా? ఇక్కడ నాయకుల పేర్లు అక్కర్లేదు. కాని నాయకుల విలువ ముఖ్యం. ఇలా డ్రగ్స్‌లో పట్టుబడితే రేపటిరోజున ప్రజల ముందు ఎలా తలెత్తుకోగలమని ఒక్క క్షణం కూడ ఆలోచించరా? మాదకద్రవ్యాలను మానుకోలేరా? మానుకోలేని నాయకులు ప్రజా నాయకులుగా అర్హులు కాదు. వారిని పార్టీలకు కూడా వెలివేయాలి. పైగా చట్ట పరంగా శిక్షను కూడా అనుభవించాలి. అప్ప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. డ్రగ్స్‌కు అలావాటు పడిన వారికి భయం పడుతుంది. దానిని ముట్టుకోవాలన్నా, పేరెత్తాలన్నా గుబులు పుట్టాలి. చట్టం తమను శిక్షిస్తుందన్న భయం వుండాలి. సిఎం. రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదన్నట్లే పట్టుబడిన వారిని జైలు పంపడంతో గట్టి హెచ్చరిక జారీ చేసినట్లే..యువత కూడా మారితే మన తెలంగాణ గొప్పగా తీర్చిదిద్దబడుతుందని చెప్పడంతో సందేహం లేదు. తెలంగాణ డ్రగ్స్ ప్రీ స్టేట్ చేయడం ప్రతి ఒక్కరి బాద్యతగా తీసుకున్నప్ప్పుడు అది అసాధ్యమసలే కాదు..అందరం ప్రతిజ్ఞ చేయాలి. డ్రగ్స్ ప్రీ స్టేట్ కోసం అందరం కషి చేయాలి. చట్టపరంగా ఈగల్ టీం చేసేది చేస్తున్నది. వారికి అందరం సహకరిస్తే డ్రగ్స్ ఫ్రీ స్టేట్ సాద్యమే.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version