బిజెపి ఘన విజయంపై నేతల సంబరాలు-స్వీట్లు పంచి పటాకులు కాల్చి హల్చల్.

బిజెపి ఘన విజయంపై నేతల సంబరాలు-స్వీట్లు పంచి పటాకులు కాల్చి హల్చల్.

కోదాడ, నేటి ధాత్రి :

మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో మండల అధ్యక్షుడు గాదరి పుల్లారావు అధ్యక్షతన జిల్లా కార్యదర్శి యరగాని కళావతి రాధాకృష్ణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అస్సాం, పొందుచ్చేరి, పశ్చిమ బెంగాల్ లో ఘన విజయం సాధించిన సందర్భంగా ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకొని ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయని అన్నారు. దశాబ్దాల తరబడి కొనసాగిన భయాందోళనలు, రాజకీయ హింసను ప్రజలు తమ ఓటు ద్వారా ముగింపు పలికారని పేర్కొన్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా మమతా బెనర్జీ తన నిరంకషత్వాన్ని ప్రదర్శించారని ప్రజలు మహిళలు తగిన రీతిలో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారని తెలిపారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ కార్యవర్గ సభ్యులు యరగాని రాధాకృష్ణ, కోదాడ మండల ఉపాధ్యక్షుడు జాబిశెట్టి పూర్ణయ్య, సీనియర్ నాయకులు భూమా శ్రీనివాస్, బాల బోయిన నాగ బ్రహ్మం, గుడిబోయిన నవీన్ గారు, ఎస్సీ మోర్చానాయకులు చింద్రియాల సురేంద్రబాబు, కిసాన్ మోర్చా నాయకులు బేతం శౌరి రెడ్డి, తిరుపతయ్య, దాచేపల్లి శ్రీనివాస్, గుడిబండ గ్రామ బూతు అధ్యక్షులు,పొనగాండ్ల వెంకటేష్ రెడ్డి, ఎరగాని గురవయ్య, అన్నప్ప, తిరుపతి బాబు,నాని, యరగాని రాజబాబు, గోవింద్, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version