జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల నిరసన
సింగరేణి జిఎం దంద వైఖరి వీడాలి
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలో తాత్కాలిక కోర్ట్ భవన సముదాయానికి కేటాయించిన పాత పోలీస్ హెడ్ క్వాటర్ – సింగరేణి కమ్యూనిటీ హాల్ స్థలం” తిరిగి తాత్కాలిక కోర్ట్ భవన సముదాయం ఏర్పాటు చెయ్యాలి జిల్లా కోర్ట్ కు అప్పగించాలని, జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు అందరూ విధులు బహిష్కరించి నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ జిల్లా కక్షిదారుల పట్ల గానీ, ప్రభుత్వ యాత్రంగాల పట్ల గానీ, న్యాయస్థానాల పట్ల గానీ, ఎలాంటి గౌరవం లేని భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ పక్షపాత ద్వంద వైఖరికి నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు అందరూ కోర్ట్ విధులను బహిష్కరించడం జరిగింది ప్రస్తుతం ఉన్న కోర్టు భవనంలో కనీసం సౌకర్యాలు లేవు లాట్ రూమ్స్ బాత్రూమ్స్ లేక మహిళలకు న్యాయవాదులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కావున స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ స్పందించి సింగరేణి జిఎంతో మాట్లాడి సింగరేణి కమ్యూనిటీ హాల్ భవనాన్ని కోర్టుకు కేటాయించాలని వారిని మేము కోరుతున్నాము అలాగే సింగరేణి జిఎం దంద వైఖరిని వీడాలి కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఇస్తానని మాటలు చెప్పుకుంటూ మూడు నెలల నుండి కాలయాపన చేస్తున్నాడు మాకు కమ్యూనిటీ ఆలు ఇవ్వకపోతే మేము నిరసన కార్యక్రమాలు చేయడానికి వెనుకాడమని సింగరేణి జిఎంను హెచ్చరిస్తున్నాం అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వాళ్లబోజు శ్రీనివాస చారీ, జనరల్ సెక్రటరీ వి.శ్రవణ్ రావు,జాయింట్ సెక్రటరీ సంగేమ్ రవీందర్, కోశాధికారి మంగళపల్లి రాజ్ కుమార్,స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ ఇందారపు శివ కుమార్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, కనపర్తి కవిత, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వేశాల రవీందర్,
నీలం ప్రశాంత్, కందుల సుధారాణి, సీనియర్ న్యాయవాదులు కూనురు సురేష్ కుమార్, మెరుగు రవీందర్, పగడాల ఆనంద రావు, తదితరులు పాల్గొన్నారు
