నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ తొలి పోరాట అమరుడు
దొడ్డి కొమురయ్య అమరత స్ఫూర్తితో భూ పోరాటాలు నిర్వహిస్తామని అఖిల భారత రైతు కూలీ సంఘం నర్సంపట డివిజన్ అధ్యక్షులు గట్టి కృష్ణ, భోగి సారంగపాణి అన్నారు. మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమక్రసీ పార్టీ కార్యాలయంలో కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 78వ స్మారక దిన సందర్భంగా ఆయన చేసిన భూమి కావాలని, నైజాం నవాబు దుర్మార్గాలకు తెలంగాణలో జరిగిన పోరాటం భారతదేశానికి స్ఫూర్తినిచ్చిందని యాది చేశారు. ఈ పోరాటం వల్ల గ్రామ స్వరాజ్యాలు ఏర్పడి, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వన 10 లక్షల ఎకరాల భూమి ప్రజలు సాగు చేసుకుని అనుభవించారని ఆయన తెలిపారు. దేశంలో భూ సమస్యను పరిష్కరించి, వ్యవసాయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చేయూత ఇవ్వాలని కోరారు. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భూములను అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు డివిజన్ కార్యదర్శి గుర్రం అజయ్ ,ఏఐకేఎంఎస్ నాయకులు మల్లన్న, భద్రాజి, సమ్మయ్య, పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటస్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.