కే టి పి పి ఉద్యోగి గుండెపోటుతో మృతి

గణపురం నేటి ధాత్రి

చీఫ్ ఇంజనీర్ చిట్టప్రగడ ప్రకాష్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అకౌంట్స్ విభాగం లో అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న కీర్తి శేషులు చెప్యాల శ్రీదర్ రావు అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ తరలించారు అక్కడ పరీక్షించిన వైద్యులు గుండె భాగంలోని రంద్రాలు పూర్తిగా మూసుకుపోయాయి అని గుర్తించి శస్త్ర చికిత్స చేశారు వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ 08/11/2024 తెల్లవారుజామున సమయం లో మరో సారి గుండెపోటు రావడంతో అదే సమయంలో తుది శ్వాస విడిచారని తెలియడంతో కెటిపిపి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు శ్రీదర్ రావు గారి అంత్యక్రియలు తన స్వగ్రామం రామగుండం లో జరిగాయి కెటిపిపి ఉద్యోగులు అక్కడ కి వెళ్లి వారి అంతిమయాత్ర లో పాల్గొనడం జరిగింది ఈ రోజు కెటిపిపి సర్వీస్ బిల్డింగ్ ల చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగడ ప్రకాష్ గారి ఆద్వర్యంలో మృతుడు శ్రీదర్ రావు గారి చిత్రపటం ఏర్పాటు చేసి కన్నీటి పర్యంతం అయ్యారు అధిక సంఖ్యలో ఉద్యోగులు కార్మికులు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు అకౌంట్స్ అదికారులు ఇంజనీర్స్ మహిళా ఉద్యోగులు వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు అర్టీజన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version