హర్షం వ్యక్తం చేసిన ఆర్య వైశ్య సంఘం!!
ఎండపల్లి నేటిధాత్రి
ఎండపల్లి మండల కేంద్రంలోని రాజారాంపల్లి లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు, అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా ఆర్యవైశ్యులను మోసం చేసి కాలం వెళ్ళ దీసాయని,కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరూపించుకోవడం జరిగిందని ఈ కార్పొరేషన్ కు చైర్మన్ గా కాల్వ సుజాత ను నియమించినందుకు అలాగే ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్య వైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్తా, గంప సంతోష్, గుంత సంతోష్, రేణికుంట సతీష్, చిట్టిమల్ల రమేష్, యంసాని రమేష్, కాచం చంద్రశేఖర్, మల్యాల శ్రీనివాస్, సాగర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.