రూ.1,120 సిలిండర్ నుంచి రూ.700 వరకు రాబడి
అవంగపట్నం లో అక్రమ రీ ఫిల్లింగ్ కేంద్రం.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
పేదలకు అందాల్సిన సబ్సిడీ సిలిండర్లు అక్రమ వ్యాపారుల చెంతకు చేరుతున్నాయి. ఎల్పిజి ఆర్డర్ ను ఉల్లంఘిస్తూ ఒక డొమెస్టిక్ సిలిండర్‌లోని గ్యాస్‌ను కమర్షియల్ సిలిండర్ లో నింపి వ్యాపారం చేస్తున్నారు. ఈ దందా మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని అవంగపట్నం నిర్వాసిత ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. కోయిలకొండ మండలంలో నిత్యం వందల సంఖ్యలో కమర్షియల్ సిలిండర్ల విక్రయాలు జరుగుతున్నాయి. మార్కెట్‌లో సులభంగా దొరికే డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల అమ్మకందారులు సబ్సిడీ గ్యాస్‌ను తమ అక్రమ వ్యాపారానికి వాడుతున్నారు. ప్రభుత్వం అందించే గ్యాస్‌బండలో సుమారు 14.5 కేజీల వరకు గ్యాస్ ఉంటే.. వీటి నుంచి కమర్షియల్ సిలిండర్‌లోకి గ్యాస్‌ను నింపి హోటల్ యజమానులకు ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. విశ్వాసనీయ సమాచారం మేరకు కోయిలకొండ మండలం అవంగపట్నం వద్ద రెహమాన్ గ్యాస్ కంపెనీకి చెందిన నిర్వాసిత స్థలం పై జిల్లా పౌర సరఫరాల అధికారి కే శ్రీనివాస్, డిటీ, సిఎస్ ఎన్ఫోర్స్మెంట్ ఎ. నాగరాజు కోయిలకొండ, వరప్రసాద్ డిటిసిఎస్ ఎన్ఫోర్స్మెంట్ నవాబుపేట, కే. వెంకటేశ్వర్ రెడ్డి డిటిసిఎస్ ఇన్ఫోసిమెంట్ జడ్చర్ల, @ డి ఆదిత్య గౌడ్ డిటిసిఎస్ ఎన్ఫోర్స్మెంట్ హన్వాడ. వారి తో కలిసి 64 కమర్షియల్ సిలిండర్,84 డొమెస్టిక్ సిలిండర్స్ మొత్తం148 సిలిండర్స్ ఒక బోలెరో వాహనాన్ని సీజ్ చేసి సురక్షిత కస్టడీ కోసం కోయిలకొండ పిఎస్ లో అప్పగించినట్లు తెలిపారు.
రీ ఫిల్లింగ్ ప్రమాదమని తెలిసినా రాత్రి వేళలో జనవాసాల మధ్య సాగుతుండడం గమనార్వం. ఇక్కడ చాలా వరకు వ్యాపార కేంద్రాల్లో అన్ని వస్తువుల మాదిరిగానే కమర్షియల్ సిలిండర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ సిలిండర్లు రెహమాన్ గ్యాస్ కంపెనీకి చెందినవిగా ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. గ్యాస్ ఏజెన్సీలో 1) చింతకింది రమేష్,2)చింతకింది శ్రీహరి,3)చౌదర్పల్లి యాదయ్య, వారిపై కోయిలకొండ పోలీస్ స్టేషన్లో కేసు కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు.