ఇబ్రహీంపట్నం,నేటిధాత్రి
డిసెంబర్ 6 మరియు 7 తేదీల్లో 2024-2025 విద్యా సంవత్సరం నకు గాను 52వ జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన జగిత్యాల లో జరిగింది. ఇట్టి ప్రదర్శనలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల కోమటి కొండాపూర్ కు చెందిన 6 వ తరగతి విద్యార్థిని తెడ్డు నశ్విత వనరుల నిర్వహణ విభాగంలో ప్రదర్శించిన ప్రొటెక్షన్ ఆఫ్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ జిల్లా స్థాయి ప్రథమ బహుమతి సాధించి,రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికయినందుకు జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ కుమార్, జిల్ల్లా విద్యాధికారి రాము గార్లు షీల్డ్, ప్రశంసాపత్రం అందజేశారని ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా గైడ్ టీచర్ జ్యోష్ణ, విద్యార్థి నశ్విత లను ప్రధానోపాధ్యాయులుశ్రీనివాస్ రెడ్డి,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బక్కూరి రాధిక, ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, నర్మదా, రాణి లు అభినందించారు