నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలో చంద్రయ్యపల్లి గ్రామంలో గల చంద్ర పురుషుల పొదుపు సంఘం సభ్యుడు సముద్రాల బుచ్చినర్సు ఇటీవల అనారోగ్యంతో మరణించగా అతని భార్య కమలమ్మకు సంఘ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ అధ్యక్షతన దుగ్గొండి సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ చేతులమీదుగా సామూహిక నిధి పథకం రూ.70 వేలు,అభయనిది పథకం రూ.10 వేలు సోమవారం సంఘా కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బానోతు రమేష్, పాలకవర్గ సభ్యులు వడ్డేపల్లి మృత్యుంజయుడు,భాషబోయిన రాజు,పాక రాజయ్య,సలపాల ప్రభాకర్,మామిడి ఐలయ్య,భాషబోయిన చరణ్ రాజ్, బానోతు సాంబయ్య,ఉప్పుల రాజు, అజ్మీర జితేందర్, ఘణకులు ఎడెల్లి మహేందర్ రెడ్డిలతో పాటు తాళ్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.