ఇక్కడ కింగ్‌..అక్కడ కింగ్‌ మేకర్‌!

https://epaper.netidhatri.com/view/287/netidhathri-e-paper-7th-june-2024%09

-చంద్రబాబు బాబు ద్విపాత్రాభినయం.

-యోధుడికెప్పుడూ విజయం తలవంచాల్సిందే.

-పరాజయం పరాక్రముణ్ణి చూసి పారిపోవాల్సిందే.

-అనుభవమే మళ్లీ జయించింది!

-జగన్‌ మిడిసిపాటు మింగింది.

-తొందర పాటు తన్నింది.

-నిలకడ లేని తనం నిండా ముంచింది.

-వేధింపులు తిరగబడ్డాయి.

-ఐదేళ్లూ జనంలోకి వచ్చింది లేదు.

-ప్రజలను కలిసింది లేదు.

-గెలిచినా ఓడినా చంద్రబాబు జనంలోనే వున్నాడు.

-జనం కోసమే తాపత్రయ పడ్డాడు.

-జనం మేలు గురించే పరితపించాడు.

-మరో సారి చంద్రబాబే జననేత అనిపించుకున్నాడు.

-ప్రజానేతగా మళ్ళీ పిలిపించుకుంటున్నారు.

-తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నాడు.

-జైలుకెళ్లినా వెరవలేదు.

-జనం కోసం తన ప్రయాణం ఆపలేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సుడి అంటే నిజంగా చంద్రబాబుదే. ఈ వయసులో కూడా సుడిగాలిలా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను ఊడ్చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్‌ సునామీ సృష్టించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కాని కొన్ని విజయాలు చారిత్రాత్మకం. ఊహించని విజయాలు దక్కినప్పుడే ఆ నాయకుల సామర్ధ్యం తెలుస్తుంది. అందరూ సహజమైన విజయాల గురించే ఆలోచిస్తారు. అనూహ్యంగా వచ్చే విజయాలను ఎవరూ అంచనా వేయలేరు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అనేక సంచనాలే. ప్రతి సారి ఆ రికార్డులను అదే పార్టీ అధిమించడం గమనార్హం. ఏది ఏమైనా చంద్రబాబైనా, తెలుగుదేశం పార్టీ అయినా ఇంతటి ఘన విజయం గతంలో ఎప్పుడూ చూడలేదు. కాకపోతే ప్రతిపక్షానికి ఆ హోదా దక్కకుండా చేయడంలో రెండుసార్లు తెలుగుదేశంపార్టీకే అవకాశం రావడం యాదృచ్చికం. 1994 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఆనాడు కూడా సునామీలా వచ్చింది. కాంగ్రెస్‌కు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 26 సీట్లు వచ్చాయి. దాంతో ఆపార్టీకి అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇప్పుడు కూడా జగన్‌కు ప్రతిపక్ష హోదా దక్కనంత విజయాన్ని తెలుగుదేశం పార్టీ అందుకున్నది. చంద్రబాబు ఎప్పుడూ తిరుగులేని నేతగానే వున్నారు. ఎదరులేని రాజకీయాలే చేస్తున్నారు. గత నలభై సంవత్సరాల తన రాజకీయ జీవితంలో అనేక ఎత్తు పల్లాలు చూశాడు. గెలుపులు చూశాడు. అదే విధంగా ఓటములు కూడా చూశాడు. రెండిరటీనీ సమానంగా తీసుకున్నాడు. గెలుపొచ్చినప్పుడు పొంగిపోలేదు. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోలేదు. ఏనాడు కక్ష్యపూరిత రాజకీయాలు చేయలేదు. నిజంగా చంద్రబాబు గతంలో అలాంటి రాజకీయాలు సాగిస్తే జగన్‌ పాదయాత్ర కూడా చేసేవారు కాదు. కాని ఆ విషయం జగన్‌ మర్చిపోయారు. తన వయసుకంటే రాజకీయ అనుభవం వున్న చంద్రబాబును ఇబ్బందులకు గురి చేయాలని పదే పదే చూశాడు. పదే పదే అవమానాలకు గురి చేసే కుట్రలకు తెరతీశాడు. వ్యక్తిగతంగా దూషణలకు దిగారు. ఇలా నిత్యం చంద్రబాబును ఏదో రకంగా ఇబ్బందులకు గురిచేసే రాజకీయాలు జగన్‌ చేస్తూ వచ్చాడు. అయినా చంద్రబాబు ఓపిగా భరిస్తూ వచ్చారు. మళ్లీ తన రోజు తప్పకుండా వస్తుందన్న నమ్మకంతో ఆయన రాజకీయాలను సాగించారు. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడైనా ఎదరులేని నేతనే. ఎన్ని ఎత్తు పల్లాలు చూసినా ఆయన ఏనాడు వెరలేదు. అదరలేదు. బెదరలేదు. దివంగత వైఎస్‌ కూడా చంద్రబాబును అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేశాడు. కాని జగన్‌ అంతగా కక్ష్య సాధింపులు చేపట్టలేదు. మాటలతో కొన్ని సార్లు చంద్రబాబు ఆత్మస్ధైర్యం దెబ్బతీసే ప్రయత్నం వైఎస్‌. రాజశేఖరరెడ్డి చేశారు.

ఒక దశలో చంద్రబాబును తన తల్లి కడుపున ఎందుకు పుట్టానా అని ఏడ్చే రోజులు తెస్తానని శపథం చేశాడు.

అలా కూడా చంద్రబాబును బెదిరించారు. అయినా రాజకీయాలను నుంచి పారిపోలేదు. రాజకీయంగా ప్రత్యర్ధులందరినీ ఎదురించి నిలిచాడు. ఎదురించి కలబడ్డాడు. కదన రంగం నుంచి ఏనాడు వెనుదిరగలేదు. ఏ ఎన్నికల్లోనూ ఆయన పారిపోలేదు. ఎన్నిక ఎలాంటిదైనా, చిన్న దైనా,పెద్దదైనా పోరాడకుండా వుండలేదు. పోరాట పటిమనే ఎప్పుడూ చూపించారు. ఇప్పుడు కూడా మరోసారి తనకు ఎదరులేదని నిరూపించాడు. రాజకీయంగా సరికొత్త చరిత్రను సృష్టించారు. తన రాజకీయ చాణక్య నీతితో ఫర్పెక్ట్‌గా ముందుకు వెళ్లాడు. ప్రతి దానిని అంచనా వేయడంలో చంద్రబాబు దిట్ట. రాజకీయాల్లో ప్రతి అంచనా విజయం సాధించాలని లేదు. కాని ఎక్కువ విజయాలు సొంతం కావడం అన్నది ఎప్పుడూ జరుగుతుంది. అది చంద్రబాబు విషయంలో అనేక సార్లు నిజమైంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక రెండు కొత్త తెలుగు రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో 2014లో ముచ్చటగా ముగ్గురు నేతలైన మోడీ, చంద్రబాబు, పవన్‌లు ఏకమయ్యారు. జగన్‌ను ఓడిరచారు. ప్రజల చేత అనుభవజ్ఞుడైన చంద్రబాబే కావాలనుకున్నారు. ఆయనను గెలిపించుకున్నారు. దాంతో ఆయన ఐదేళ్ల కాలంలో శాయ శక్తులా రాష్ట్రాభివృద్ది కోసం అహర్నిషలు పనిచేశారు. రాజధాని నిర్మాణం మొదలు పెట్టారు. అసెంబ్లీ, సచివాయలయాలను నిర్మాణం చేశాడు. అమరావతి రాజధానికి పునాదులువేశాడు. అయితే బిజేపి ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కింది. అమరావతి అభివృద్దిని మర్చిపోయింది. ప్రత్యేక హోదా పక్కన పెట్టింది. పోలవరం విషయంలో చిన్న చూపు చూసింది. దాంతో తెలుగుదేశం బిజేపి మీద తిరగబడ్డారు. గత ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేశారు. కాకపోతే ఒక్కచాన్స్‌ ప్లీజ్‌ అంటూ పాదయాత్ర చేసిన జగన్‌ నవరత్నాలతో ప్రజలకు ఆశలు కల్పించారు. దాంతో ప్రజలు జగన్‌కు గెలిపించారు. కాని జగన్‌ అమరావతిని ఆగం చేశాడు. మూడు రాజధానులంటూ మడత పేచీ పెట్టారు. ఆఫ్రికా దేశానికి మూడు రాజధానులు లేవా? అంటే కొత్త కొర్రీలు పెట్టారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌కు రాజదాని లేకుండా చేశాడు. అమరావతిని ఆగం చేశాడు. చెప్పుకోవడానికి రాజధాని లేకుండా చూసి ఐదేళ్లు ప్రజల్లోకి రాకుండా పాలన సాగించాడు. ఇక తనకు ఎదురులేదని కలలుగన్నాడు. ఎప్పటికీ తనదే అధికారమని భ్రమపడ్డాడు. కాని చంద్రబాబు మరోసారి సునామీలా విరుచుకుపడతాడని ఊహించలేదు. ఆయన కోటరీ కూడా ఈ విషయం చెప్పలేదు. జగన్‌ను మాయ చేసి,ఆ మాయా జగత్తులో వుంచేశారు. ఇదే సమయంలో చంద్రబాబు జాతీయ రాజకీయాలను బాగా స్టడీచేశారు. కాంగ్రెస్‌పార్టీ జాతీయ స్దాయిలో అనుకున్నంతగా పుంజుకున్న దాఖలాలు లేవని గ్రహించాడు.

ఎక్కడ నెగ్గాలో..ఎక్కడ తగ్గాలో తెలిసిన చంద్రబాబు తెలుగు ప్రజల కోసం ఒక్కసారి తగ్గితే తప్పేం లేదునుకున్నాడు.

తగ్గితే ప్రజలకే మేలు జరుగుతుందని ఆలోచించాడు. జాతీయస్దాయిలో ఇంకా బలంగానే ప్రభావం చూపుతున్న బిజేపి జతకట్టడమే మేలనుకున్నాడు. అందరూ బిజేపితో ఏముందని ప్రశ్నించినా, వద్దని వారించినా చంద్రబాబు వినలేదు. ఆయన ముందడుగు మానలేదు. కాంగ్రెస్‌తో వెళ్తే మరింత మంచిదని కూడా చాలా మంది సూచించారు. కాని జాతీయ స్ధాయిలో ప్రజల అభిప్రాయం అంచనావేసిన చంద్రబాబు ఫర్పెక్టు నిర్ణయం తీసుకున్నారు. బిజేపితో పొత్తు పొడిపించారు. వాళ్లు అడిగినసీట్లు కూడా ఇచ్చారు. ఒక దశలో డిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు అప్పాయింటు మెంటు దొరక్కపోయినా తొందరపడలేదు. మనకు తప్పకుండా ఒకరోజు వస్తుందనే నమ్మకంతో చంద్రబాబు ముందుకు సాగారు. ఎన్నికల సమయంలో కూడా బిజేపి పొత్తుతోసాగినా, ప్రధాని మోడీ తమ పొత్తును గురించి ప్రచారం చేయకపోయినా చంద్రబాబు సర్ధుకున్నారు. మొత్తానికి ప్రజలచేత ఆమోదింపబడి సునామీ లాంటి విజయాన్ని దక్కించుకున్నాడు. తగ్గితే తప్పేమీ లేదనుకున్నాడు. తల ఎగరేసేరోజుదగ్గర్లోనే వుందని చంద్రబాబు గట్టిగా నమ్మారు. నిజం చేసుకున్నాడు.

కౌరవ సభలాంటి జగన్‌ముఖ్యమంత్రిగా వున్న అసెంబ్లీలో మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశాడు.

ప్రజల్లోకి వెళ్లారు. జగన్‌ పాలనపై నిప్పులు చెరిగారు. జనసేనతో కలిసి ముందుకు సాగారు. జనసేనను తోడుగా కలుపుకున్నారు. జనం ఆలోచనలకు ప్రతిరూపం ఇచ్చారు. ఆంద్రప్రదేశ్‌ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నాడు. వాటి అమలు కోసం ప్రయత్నం చేస్తానని చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తారని ప్రజలు బలంగా నమ్మారు. పోలవరం పూర్తికేవలం చంద్రబాబు వల్లనే సాద్యమౌతుందనుకున్నారు. యువత భవితను చంద్రబాబు మాత్రమే తీర్చిదిద్దగలని ప్రజలు మరోసారి విశ్వసించారు. చంద్రబాబులేకుంటే రాష్ట్రం అనాద అవుతుందని ప్రజలు ఆలోచించారు. గతంలో ఎంత గొప్పగా జగన్‌ను గెలిపించారో..అంత ఘోర పరాజయం జగన్‌కు ఇచ్చారు. ప్రజలు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. ప్రజలకు నచ్చకపోతే బండకేసి కొడతారు. ఈ రెండు తెలియక రాజకీయాలు చేస్తే భవిష్యత్తు లేకుండాచేస్తారు. ఇది జగన్‌ నేర్చుకోవాల్సిన పాఠం… చంద్రబాబే తెలుగు ప్రజలకు ఆశాకిరణం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version