ప్రజాహిత యాత్రపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయచెందర్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు హుస్నాబాద్ లో ప్రజాహిత యాత్ర పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుజురాబాద్ ప్రబారి డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి అన్నారు.బుధవారం రోజు పరకాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో బిజెపి పార్టీకి మోడీకి పెరుగుతున్న ఆదరణను ముఖ్యంగా బండి సంజయ్ కి ప్రజలల్లో ఉన్న అభిమానాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ కిరాయి గుండాలు మంత్రి పొన్నం ప్రభాకర్ యొక్క అనుచరులు అప్రజాస్వామీకంగా చేసిన దాడిని ప్రజాస్వామ్యం పైజరిగిన దాడిగా పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ఇలాంటి దాడులే పునరావృతం అయితే ప్రతి దాడులు తప్పవని కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ అనుచరులను హెచ్చరించారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బండి సంజయ్ గెలుపే లక్ష్యంగా ప్రతి భారతీయ జనతాపార్టీ కార్యకర్త ప్రజా యాత్రలో పాల్గొని కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించుకొని నరేంద్ర మోడీకి కానుకగా ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రబారి మురళీధర్ గౌడ్,పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్,ఆర్పి జయంత్ లాల్,పూర్ణాచారి,మేఘనాథ్,మార్త రాజభద్రయ్య,గురుజాల శ్రీరామ్,ముత్యాల శ్రీనివాస్,ఎర్రం రామన్న,కంది క్రాంతి కుమార్,పగడాల రాజకుమార్,రాధారపు శివకుమార్ ముల్క ప్రసాద్, గాజుల నిరంజన్,బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.