విద్యుత్ కార్మికులకు మద్దతు కీర్తి రెడ్డి…

విద్యుత్ కార్మికులకు మద్దతు కీర్తి రెడ్డి

కె టి పి పి చెల్పూర్ విద్యుత్ కార్మికుల పోరాటానికి బీజేపీ అండ!

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ విద్యుత్ ఆర్టిసన్, అన్-మ్యాన్డ్ పీస్ రేట్ కార్మికుల న్యాయమైన సమస్యల సాధనకై నిర్వహిస్తున్న సమ్మెకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి బీజేపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునూతల నిషిధర్ రెడ్డి నేడు ప్రత్యక్షంగా హాజరై, కార్మికులతో కలిసి కూర్చొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ చీకటిని తరిమి వెలుగులు నింపే విద్యుత్ కార్మికుల జీవితాల్లో ప్రభుత్వం చీకట్లు నింపడం అన్యాయం. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.
కార్మికుల హక్కుల కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సమస్యలు తీరని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం
ప్రధాన డిమాండ్లు
విద్యుత్ సంస్థల్లో అర్హత కలిగిన ప్రతి ఆర్టిసన్ ఉద్యోగిని కన్వర్షన్ చేయాలి.
ఏపీ ఎస్ ఈ బి సర్వీస్ రూల్స్ తక్షణమే అమలు చేయాలి. అన్-మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిసన్లుగా విలీనం చేయాలి.
2016 కంటే ముందు నుండి పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులను గుర్తించాలి.
జీవో నెం.11 ప్రకారం కనీస వేతనాలు & 2026 పి ఆర్ సి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధర్నా కు కనీసం టెంట్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనంతరం కీర్తి రెడ్డి ఎస్ఓ తో నేరుగా మాట్లాడి పరిమిషన్ ఇవ్వాలని కోరడం జరిగింది రేపటి రోజు వరకు టెంటు వేయకపోతే మేమే దగ్గర ఉండి టెంటు వేయించి వారి న్యాయమైన డిమాండ్లు నేరెవెరే వరకు వారికీ అన్నివిధాలా అండగా నిలుస్తాం అని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో
మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు ప్రధాన కార్యదర్శి బనగాని రాజశేఖర్
మండల సోషల్ మీడియా కన్వీనర్ సాయి పటేల్
బూత్ అధ్యక్షులు జెడ్సన్, కంకణాల వంశీ, మొగిలి మనోహర్ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version