రేపు సిట్ విచారణకు కేసీఆర్..

రేపు సిట్ విచారణకు కేసీఆర్..?

 

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ (SIT) జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేపు విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని సమాచారం.

 తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిట్ (SIT) విచారణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కఠం నెలకొంది. గత కొద్ది రోజులుగా నోటీసుల చుట్టూ జరుగుతున్న వివాదానికి రేపటితో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!
ఎర్రవల్లి నుంచి నందినగర్‌కు..

ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో ఉంటున్న కేసీఆర్.. రేపు (ఆదివారం) ఉదయమే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు. నిబంధనల ప్రకారం 65 ఏళ్లు దాటిన వారిని.. ఇంటి వద్దే విచారించాలన్న నిబంధనను దృష్టిలో ఉంచుకుని.. కేసీఆర్ తన ఇంట్లోనే అధికారులకు అందుబాటులో ఉండనున్నారు.

కీలక సమావేశం తర్వాతే నిర్ణయం..

సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేసీఆర్ తన ముఖ్య అనుచరులు, న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. న్యాయవాదుల బృందంతో సమావేశమై, అధికారుల ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి, చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించిన తర్వాత.. మధ్యాహ్నం 3 గంటలకు అధికారులకు అందుబాటులోకి రానున్నారు.

రాజకీయ ప్రాధాన్యత..

కేసీఆర్ నివాసం ముందు గోడపై నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి సిట్ అధికారులు నోటీసులు అంటించడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా విచారణకు సహకరించడం ద్వారా ప్రభుత్వానికి, పోలీసులకు ధీటైన సమాధానం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version