చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం కట్ట లింగంపేట వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు చందుర్తి ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బుధవారం చందుర్తి సాయిబాబా ఆలయ ఆవరణలో ఎంపిటిసి పులి రేణుక సత్యం, చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ చేతుల మీదుగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు యోగ మ్యాట్ లను అందజేశారు… ఈ సందర్భంగా నాయకుడు పులి సత్యం మాట్లాడుతూ….ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని, యోగాతో దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతున్నాయని, ప్రతిఒక్కరూ గంటసేపు యోగా చేయాలని పిలుపు ” నిచ్చారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శివాల భక్తర్, ఏనుగుల పరుశరాములు, కాదాసు రవి, మిరుపల్ల ప్రసాద్, అవారి మనోహర్, మల్లారపు రమేష్, అంజి తదితరులు పాల్గొన్నారు.