పాల్గొన్న బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు వెంకన్న
#నెక్కొండ, నేటి ధాత్రి: జనవరి 31వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల పదవీకాలం ఉండడంతో మండలంలోని అజ్మీర మంగ్య నాయక్ తండ సర్పంచ్ సరోజా వెంకట్ నాయక్ ను బిఆర్ఎస్ నెక్కొండ మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకన్న నాయక్ ఘనంగా సన్మానించారు. అనంతరం వెంకన్న నాయక్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు అజ్మీర మంగ్య నాయక్ తండ సర్పంచ్ గా ఎనలేని సేవలందించిన సరోజ వెంకట్ నాయక్ ప్రజలను కంటికి రెప్పవలె కాపాడుకున్నారని పార్టీలకు అతీతంగా పనిచేసిన సరోజ వెంకట్ నాయక్ అని నెక్కొండ బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకన్న అన్నారు. ఈ కార్యక్రమంలో లంబాడా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాలో దేవేందర్, భానోత్ నెహ్రూ నాయక్, ప్రవీణ్ నాయక్, శివలాల్ నాయక్, శ్రీనివాస్ నాయక్, జాటోతు శివ నాయక్, విజేందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.