సజీవ సుజల దృశ్యం కాళేశ్వరం!

`వెయ్యేళ్లైనా చెక్కు చెదరని కట్టడం.

`కేసీఆర్‌ కలల రూపంలో ఆదునిక దేవాలయం.

`తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగులు నింపిన జల ప్రపంచం.

`అపర భగీరధుడు కేసిఆర్‌ కీర్తికి చరిత్రలో చెరగని సంతకం కాళేశ్వరం.

`కేసీఆర్‌ తెలంగాణ తల రాత మార్చిన అభినవ విశ్వామిత్రుడు.

`కేసీఆర్‌ తెలంగాణ నెత్తిన గంగమ్మను నింపిన శివుడు.

కాళేశ్వరం పేరు ఉచ్చరించే అర్హత లేని కాంగ్రెస్‌ ను ప్రజలు ఆదరిస్తే జనం గోస పుచ్చుకుంటున్నారు. రైతు కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరం ఎండబెట్టి, తెలంగాణను ఎడారి చేస్తూ ప్రజల ఉసురుపోసుకుంటున్నారు. కాళేశ్వరం విలువ తెలియదు. గొప్ప దనం భరించలేని కాంగ్రెస్‌కు కాలం దగ్గరపడిరదంటున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ 

ఉద్యమ కారుడు, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న రైతుల కష్టాలు, కాళేశ్వరం కాంగ్రెస్‌ కు కుట్రలు ఆయన మాటల్లోనే…

`ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం దాకా, పాలమూరు నుంచి కోదాడ దాకా పారిన జలసిరి కాళేశ్వరం.

`బీడులన్నీ తడిపి మగాణగా మార్చిన జల గంగ కాళేశ్వరం.

`తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం.

`తెలంగాణను సస్యశ్యామలం చేసి బంగారు పంటలుకు నెలవు కాళేశ్వరం.

`ఎండిన మోడులాంటి తెలంగాణకు చిగురు తొడిగింది కాళేశ్వరం.

`ఎడారి లాంటి తెలంగాణను ఒయాసిస్సు చేసింది కాళేశ్వరం.

`తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడిచింది కాళేశ్వరం.

`అన్నమో రామచంద్రా అని ఆకలికి ఏడ్చిన రైతు కడుపు నింపింది కాళేశ్వరం.

`వానల కోసం ఆకాశం వైపు చూసిన రైతు మురిసిన లోకం కాళేశ్వరం.

`కళ్లుండి చూడలేని కాంగ్రెస్‌కు రాజకీయ యమపాశం కాలేశ్వరం.

`కాళేశ్వరం మీద కాంగ్రెస్‌ చేస్తున్న కుట్రకు కాంగ్రెస్‌ భవిష్యత్తు సమాధికి నిదర్శనం.

`తెలంగాణ రైతుల గోస పుచ్చుకుంటున్న కాంగ్రెస్‌కు ఇదే ఆఖరు కాలం.

`రైతులు ఇబ్బంది పడాలని కోరుకునే కాంగ్రెస్‌ దౌర్భగ్యపు రాజకీయం.

`భవిష్యత్తు తరాలు ఇక కాంగ్రెస్‌ను క్షమించవు.

`రైతు సమస్యల మీద కనీస అవగాహన లేని కాంగ్రెస్‌, బీజేపీలకు తెలంగాణలో చోటు లేదు.

 

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:                                     

ఆకలైనప్పుడు అన్నం వండుకొని తినాలనుకోం.. వర్షాలొచ్చినప్పుడే వ్యవసాయం చేసుకుంటామంటే బతకలేం. పంటలు సమృద్దిగా పండాలంటే నీటిని నిల్వచేసుకోలేకపోతే సాగు సాగించలేం..నీటిని ఒడిసి పట్టుకోలేకపోతే గింజ కూడా పండిరచుకోలేం..ఇది ఎంతచిన్న లాజిక్‌ను తెలంగాణలో పలెల్లో ఎంత చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు. ఈ మాత్రం కూడా కాంగ్రెస్‌ నాయకులకు ఇంగితం లేదు. వ్యవసాయ జ్ఞానం అసలే లేదు. పాలనలో ఏ ఒక్క నాయకుడికి సోయి లేదు. తెలంగాణ రాక ముందు దశాబ్దాల తరబడి నీటికి ఏడ్చిన రైతు గోస ఎంత చెప్పినా తక్కువే. తినడానికి తిండి లేక, పొట్ట చేత పట్టుకొని వలసలు పోయిన పల్లెలు అనేకం వున్నాయి. కేసిఆర్‌ సాగు నీళ్లు తెచ్చిన తర్వాత ఏళ్ల తరబడి ఊరు ముఖం చూడని వాళ్లంతా రాత్రికి రాత్రే వచ్చిన్రు. పల్లె చేరుకొని మురిసిపోయిన్రు. చెరువుల్లో నీళ్లు చూసి కేరింతలు కొట్టిన్రు. బీడు వారిన వారి భూముల్లో మళ్లీ సాగు మొదలు పెట్టిన్రు. గజం జాగ వదలకుండా పొలం చేసుకున్నరు. చెలకలను కూడా పొలం చేసుకున్నరు. వరి పండిరచి సిరులు కళ్లనిండా చూసిన్రు. పదేళ్ల పాటు కేసిఆర్‌ పాలనలో బంగారు పంటలు పండిరచుకున్నరు. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ తెలంగాణను సస్యశ్యామలం చేసిండు. తెలంగాణకు నీళ్ల కరువు తీర్చిండు. కరంటు ఖర్చు లేకుండా చేసిండు. ఇరవై నాలుగు గంటల కరంటు ఇచ్చిండు. తొలకరి నాడే రైతు బంధు ఇచ్చిండు. నకిలీ విత్తనాల బెడద లేకుండా చేసిండు. సకాలంలో ఎరువులుచ్చిండు. రైతు కాలు కదపకుండా వ్యవసాయం చేసుకొని, కాలు మీద కాలేసుకొని పంటను అమ్ముకున్నడు. గిట్టుబాటు ధర ఇచ్చిన రైతు కడుపు సల్లగుండెలా ఊరిలోనే వడ్లు అమ్ముకునేలా చేసిండు. రైతుకు ఏ బాధ లేకుండా కండ్లలో పెట్టి కేసిఆర్‌ చూసుకున్నడు. అలాంటి కేసిఆర్‌ పేరును ఉచ్చరించే అర్హత కాంగ్రెస్‌ నాయకులకు లేదు. ఒక్క ఛాన్స్‌ అంటూ పదే పదే ప్రజలను వేడుకుంటే కనికరించారు. గెలిపించిన మరునాటి నుంచే కాంగ్రెస్‌ పాలకులు రైతు గోస పుచ్చుకుంటున్నరు. రైతు కన్నీళ్లను తుడిచిన కాళేశ్వరం ఎండబెట్టి, తెలంగాణను ఎడారి చేస్తున్నరు. ప్రజల ఉసురు పోసుకుంటున్నరు. కాళేశ్వరం విలువ తెలియని కాంగ్రెస్‌ నాయకులు, కేసిఆర్‌ పేరు లేకుండా చేస్తామని బీరాలు పలుకుతున్నారు. కేసిఆర్‌ అనే పేరే తెలంగాణలో ఒక కీర్తి శిఖరం. మేరు పర్వతం. ఎవరెస్టు శిఖరమంత వ్యక్తిత్వం, ఆలోచనా తత్వం, ఆచరణ లక్ష్యమున్న నాయకుడు. అలాంటి నాయకుడి వెంట నడవాలంటేనే అదృష్టం వుండాలి. అలాంటి నాయకుడిని ఇబ్బంది పెట్టాలని చూడడం పాలకుల వృధా ప్రయాస అంటున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న కాంగ్రెస్‌ పాలనలో రైతుల కష్టాలు, కాళేశ్వరంపై కాంగ్రెస్‌ చేస్తున్న కుట్రలపై చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే…

                                            కాళేశ్వరం అనేదే ఒక పెద్ద బహుళార్ధక ప్రాజెక్టు అని చెప్పకతప్పదు. కాంగ్రెస్‌ వాళ్లుకు నీళ్లు తెలియవు. వాటి లెక్కలు తెలియదు. పారే విధానం తెలియదు. రైతులకు ఎలా నీళ్లివ్వాలో అసలే తెలియదు. ఉమ్మడిరాష్ట్రంలో ఆంద్రా పాలకుల ముందు చేతులు కట్టుకున్నారు. నోళ్లు మూసుకున్నారు. నాడు తెలంగాణకు నీళ్లు తేవాలన్న ఆలోచన చేయలేదు. పదవులు వస్తే చాలనుకున్నారు. తెలంగాణను నీళ్లివ్వాలన్న ఆలోచన చేయలేదు. ఆ ప్రతిపాదలు ఇచ్చింది లేదు. ఉమ్మడిపాలకులను పట్టుపట్టింది లేదు. ఆంద్రాకు పోతున్న నీళ్లను అడ్డుకున్నది లేదు. తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు కట్టరని నిలదీసింది లేదు. కాని ఇప్పుడు ప్రజలను మరోసారి మోస పుచ్చి, లేనిపోని అబద్దాలు చెప్పి, అధికారంలోకి వచ్చారు. మళ్లీ పాత కాలానికి కాంగ్రెస్‌ నాయకులు తీసుకుపోతున్నారు. నమ్మితే నట్టెట ముంచడమే కాంగ్రెస్‌ నైజమని తెలిసినా ప్రజలు ఒక్కసారి అవకాశమిద్దామనుకుంటే మళ్లీ తెలంగాణను గోస పుచ్చుకుంటున్నరు. కాళేశ్వరం విలువ కాంగ్రెస్‌లో ఒక్కరికి కూడా తెలియదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దేవాదులు ఎక్కడుందో తెలియదు. ఏ బెసిన్‌లో వుందో అసలే తెలియదు. ఆఖరుకు తాను నల్లమల పులినంటూ బీరాలు పలుకుతాడు. నల్లమల ఏ రాష్ట్రపరిధిలో వుందో తెలియదు. ఇలాంటి నాయకులకు పాలన అప్పగిస్తే ఎలా వుంటుందో ప్రత్యక్షంగా ప్రజలు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక్కరే కాదు, ఆ పార్టీలో ఏ నాయకుడికి నీళ్ల గురించి తెలియదు. నదులు గురించి తెలియదు. తెలంగాణలో వున్న ప్రాజెక్టుల మీద మీద అవగాహన లేదు. కాళేశ్వరం అంటే ఏమిటో ఒక్కముక్క కూడా తెలియదు. కాని నిత్యం కాళేశ్వరం కుంగిందని చెప్పడం మాత్రం ఒక్కటే తెలుసు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఏమిటన్నది ఇప్పటి వరకు అధ్యయనం చేసే తెలివి కాంగ్రెస్‌ నాయకులకు లేదు. అయితే తెలియని వాళ్లకు చెప్పొచ్చు. తెలిసినా తెలియనట్లు నటించేవాళ్లకు ఏం చెప్పినా ప్రయోజనం లేదు. కాళేశ్వరం పడావు పెట్టి కేసిఆర్‌ కీర్తికి మరకలంటించాలనుకుంటున్నారు. అదే సమయంలో ప్రజలను గోస పెట్టుకుంటున్నారు. ఈ విషయాలు ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్‌ను ఎన్నుకున్నామా? అని ఏడుస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? కాంగ్రెస్‌ను శంకరగిరి మాన్యాలకు పంపిద్దామా! అని ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం అంటే ఒక చరిత్ర. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు. మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల. ఈ మూడు బ్యారేజీలే ఇప్పటికీ కాళేశ్వరం అని అనుకుంటున్నారు కాంగ్రెస్‌నాయకులు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు కేవలం ఆరు వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న నిర్మాణాలు మాత్రమే అని చెప్పినా వారికి చెవికెక్కడం లేదు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలతోపాటు, 15 రిజర్వాయర్లు నిర్మాణం జరిగిన సంగతి కూడా కాంగ్రెస్‌ నాయకులకు తెలియకపోవడం విడ్డూరం. అవి కనీసం ఎక్కడున్నాయో కూడా అధ్యయనం చేయలేని దౌర్బాగ్యస్ధితిలో కాంగ్రెస్‌నాయకులు, మంత్రులున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసందానంగా 19 సబ్‌స్టేషన్ల నిర్మాణాలు జరిగాయి. ఎత్తిపోతల పధకాలకు అవసరమైన కరంటు సరఫరా చేస్తున్నాయి. అవి కూడా కాళేశ్వరంలో భాగమే అనే విషయం ఏ ఒక్క కాంగ్రెస్‌నాయకుడికి తెలియకపోవడం విడ్డూరం. కాళేశ్వరం పదకంలో భాగంగా 21 పంపు హౌజ్‌లు నిర్మానం చేయబడ్డాయి. వాటి ద్వారా నీళ్లను ఎత్తిపోయడం జరుగుతోంది. అవేమీ చిన్నా, చితక మోటార్లుకాదు. బాహుబలి మోటార్లు. రోజుకు రెండు నుంచి మూడు టిఎంసిల నీటని ఎత్తిపోయగల శక్తి గల మోటార్లను కనీసం కళ్లతో కూడా కాంగ్రెస్‌ నాయకులు ఎక్కడా చూడలేదు. కాళేశ్వరం వరప్రయానిలో వరద కోసం 1531 గ్రావిటీ కెనాల్‌లను నిర్మాణం చేయడం జరిగింది. ఆ కాలువలతోనే తెలంగాణ వ్యాప్తంగా నీరు చేరుతోంది. ఆ కాలువలు కూడా దేశంలో ఎక్కడా లేనంత విశాలంగా పెద్దఎత్తున నీటిని తరలించేలా నిర్మాణం జరిగాయి. వాటిని తెలంగాణ చుట్టూ ఎక్కడ చూసినా కనిపిస్తాయి. కళ్లుండి చూడలేని కాంగ్రెస్‌ నాయకులు కుళ్లుతో ఆ కాలువలను ఎండబెడుతున్నారు. రైతుల గోస పుచ్చుకుంటున్నారు. 98 కిలోమీటర్ల మేర కొండలన తవ్వి టన్నెల్‌ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా నిర్మాణాలు చేసిన 15 రిజర్వాయర్లలో 141 టిఎంసిల నీటి కెపాసిటీతో కళకళలాడాయి. కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత ఆ రిజర్వాయర్లలో నీళ్లు నింపేందుకు మనసు రావడం లేదు. సమద్ర మట్ట నుంచి 530 అడుగుల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి, తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుంది. ఇలా ధైర్యం చేసిననాయకుడు బహుషా ప్రపంచంలోనే ఎవరూ వుండరు. కాళేశ్వరం వల్ల తెలంగాణ సాగు నీటి అవసరాల కోసం ఏటా 240 టిఎంసిల నీటిని వినియోగించుకునేందుకు సిద్దంగా వుంది. ఇలాంటి గొప్ప ప్రాజెక్టును అర్దం చేసుకునే తెలివి లేని వారికి దాని గొప్పదనం మరో జన్మ ఎత్తినా అర్దం కాదు. కాళేశ్వరాన్ని పండబెట్టి కేసిఆర్‌ మీద కక్ష తీర్చుకోవాలని చూస్తే ప్రజలే కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే రోజు ఎంతో0 దూరం వెండదు. రైతు కన్నెర్ర చేస్తే ఎలా వుంటుందో తెలియంది కాదు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version