ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ డిమాండ్
హన్మకొండ, నేటిధాత్రి:
కాకతీయ డిగ్రీ కాలేజ్ ఆవరణంలో ఏబిఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్త సమావేశనికి సిద్దు అధ్యక్ష వహించగా ముఖ్యఅతిథిగా ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ……….
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి రెండవ మూడవ సంవత్సరం విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఫీజు మరియు సంక్షేమ నిధి యూనివర్సిటీ టోర్నమెంట్ ఫీజు పేర్లతో ఇష్టం రీతులు ఫీజు పెంచి విద్యార్థుల నుండి గతంలో ఫీజు కంటే ( 900) ఉంటే 2500 రూపాయలు పెంచి విద్యార్థులను విద్యకు దూరం చేసే పని చేస్తున్నారని అన్నారు
పెంచిన యూనివర్సిటీ ఫీజుతోపాటు పరీక్ష ఫీజు చెల్లించక విద్యార్థులు విద్యను మధ్యలో ఆపివేసే పరిస్థితి నెలకొందని అన్నారు కావున పెంచిన డిగ్రీ ఫీజులను తగ్గించి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ మరియు పాలకమండ సభ్యులను ఏబిఎస్ఎఫ్ పక్షాన కోరుతున్న
లేని పక్షాన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమలు చేపడతామని హెచ్చరించారు అన్నారు
ఈ కార్యక్రమంలో సిద్దు ప్రశాంత్ వినయ్ శ్రీకాంత్ ప్రమోద్ విష్ణు రఘు రమేష్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.