జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల తహసిల్దార్ కార్యాలయంలో దివంగత నేత గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.గడ్డం వెంకట స్వామి చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి,పుష్పాలను సమర్పించి నివాళులు అర్పించారు.అనంతరం తహసిల్దార్ వనజా రెడ్డి మాట్లాడుతూ గడ్డం వెంకటస్వామి జీవితాంతం కార్మిక సంక్షేమం కోసం పోరాటం చేశారని,శ్రమ దోపిడీ నుండి కార్మికుల్ని విముక్తుల్ని చేశారని,రోజుకి 8 గంటలు మాత్రమే కార్మికులతో పని చేయించాలని ఆదివారం రోజున సెలవు ప్రకటించాలని ప్రభుత్వాలతో పోరాడి సాధించారని అందుకే ఆ మహనేతని ఆప్యాయంగా ప్రతి ఒక్కరు కాకా అని పిలుచుకుంటారని,అంబేద్కర్ బాటను అనుసరించి బడుగు,బలహీనవర్గాలకు అభ్యుదయ మార్గాన్ని చూపించారని,విశాఖ చారిటబుల్ ట్రస్టు ద్వారా స్వంత ఖర్చుతో నిస్వార్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను జరిపించారని,బోర్ వెల్స్,బస్ షెల్టర్స్,వాటర్ ట్యాంకులను ఇలా ఎన్నో ఉపయోగకరమైన పనులను ఇప్పటికీ వారి కుటుంబం కొనసాగిస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డి,గిర్దవర్ తిరుపతి,రవిచంద్ర,స్వామి, కార్యాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.