జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయములో శనివారం దివంగత మహానేత గడ్డం వెంకట్ స్వామి 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి కుంకుమ తిలకాన్ని దిద్ది,పూలమాలలతో అలంకరించి నివాళులర్పించారు.అనంతరం ప్రముఖులు మాట్లాడుతూ వెంకటస్వామి దేశం గర్వించదగ్గ మహా నేత అని, కుల,మత,వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రేమగా కాకా అని పిలుచుకునే ప్రియతమ నేత అని,కార్మికుల శ్రేయస్సు కోసం ఎనిమిది గంటల పని మాత్రమే ఒక రోజుకి చేయాలి అనే నిబంధనని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉద్యమాన్ని కొనసాగించి సాధించారని,తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారనీ,అంబేద్కర్ ఆశయాల కొరకు అహర్నిశలు కృషి చేశారని, విశాఖ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రమంతట చేపట్టారని,ఎప్పటికీ అలాగే కొనసానిస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు,స్థానిక మండల ప్రజా ప్రతినిధులు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, ఎండి. ఫయాజ్ ఉద్దీన్,చల్ల సత్యనారాయణ,చల్ల విశ్వంభర్ రెడ్డి,కార్యాలయ సూపరింటెండెంట్ భాగ్య లక్ష్మి,మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది,పంచాయితీ కార్యదర్షులు,స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.