తెలంగాణ రాజ్యాధికార పార్టీలో (టి ఆర్ పి) చేరిన నారీ శక్తి సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ( టి ఆర్ పి ) చేరిన నారి శక్తి సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి పండాల్. నేను కొన్ని రోజుల నుండి బిసి జేఏసీ నుండి బీసీలకు మద్దతుగా నిలిచిన తీన్మార్ మల్లన్న గారికి నేను మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. తీన్మార్ మల్లన్న గారు కోరుకున్న విధంగా నేను వారి పార్టీలో చేరడం జరిగింది. వారు నేను అడగకుండానే వారి కార్యవర్గంలో నాకు చోటివ్వడం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. వారి ప్రధాన కార్యదర్శి కార్యవర్గంలో మొట్టమొదటి మహిళగా నాకు స్థానం ఇచ్చినందుకు నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఇన్ని రోజుల నుండి నాకు మద్దతుగా నిలిచి నాకు సలహాలు సూచనలు ఇస్తూ నన్ను అభిమానిస్తూ వస్తున్న వారందరూ కూడా మీ సహాయ సహకారాలు మద్దతు అభిమానము ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటున్నాను.
అలాగే నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వచ్చిందని బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ వాళ్లు చాలామంది నాపైన కుట్రలు చేస్తున్నారు, తీన్మార్ మల్లన్న గారి టీమ్ మెంబర్స్ కి నాపైన నీచంగా మాట్లాడుతున్నారు, ఏడుస్తున్నారు, మీ అందరికీ ఒకటె విషయం చెప్పాలనుకున్నాను. జ్యోతి పండాల్ కి ఏదో పోస్ట్ వచ్చిందని ఏడవ కుండా తీన్మార్ మల్లన్న గారి రాష్ట్ర కార్యవర్గంలో మన ఊరు నుండి మన ఆడపడుచుకి స్థానం దక్కిందని సంతోషించాలని నేను వారికి చెప్పాలని అనుకుంటున్నాను.
మన జహీరాబాద్ నియోజకవర్గం లో ఉన్న అన్ని వర్గాల ప్రజలు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరియు కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలో ఉన్న నాయకులందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.