నేటి ధాత్రి కమలా పూర్(హన్మకొండ)
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు మండలంలో ప్రశాంత వాతావరణములో జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని కాజీపేట ఏసిపి పుప్పాల తిరుమల్ కమలా పూర్ పోలీస్ లను ఆదేశించారు.గురువారం కమలా పూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన సిబ్బందికి ఎన్నికల గురించి తగు సూచనలు,సలహాలు ఇవ్వడం జరిగింది.మండల కేంద్రం,ఉప్పల్,తదితర గ్రామాల్లో గల పోలింగ్ స్టేషన్లు,పాఠశాల భవనాలు పరిశీలించి ఎన్నికల సమయములో ఓటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని,విద్యుత్,నీరు,రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.వీటితో పాటు కన్నూర్ గ్రామములోని అంగన్వాడీ సెంటర్ ను సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమములో సిఐ హరికృష్ణ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.