వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణిస్తే చట్ట విరుద్ధమే

ఆర్కే పి పట్టణ రెండో ఎస్ఐ నూనె శ్రీనివాస్

రామకృష్ణాపూర్, నేటిదాత్రి:

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరాగడి రాజీవ్ రహదారి పై తిమ్మాపూర్ సమీపంలో రాంగ్ రూట్లో ప్రయాణించే ప్రయాణికులకు రామకృష్ణాపూర్ పట్టణ రెండో ఎస్ఐ నూనె శ్రీనివాస్ బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రాంగ్ రూట్లో ప్రయాణించడం వలన ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఎలాంటి ఇన్సూరెన్సులు వర్తించవని ప్రయాణికులకు అవగాహన కల్పించారు. రాంగ్ రూట్లో ప్రయాణించినప్పుడు ఎదురుగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉన్నట్లు వారికి వివరించారు. ట్రాఫిక్ రూల్స్, పోలీసు వారు సూచనలు పాటించాలని కోరారు. వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణిస్తే చట్ట విరుద్ధమే అవుతుందని, ప్రాణానికి సైతం ముప్పు వాటిల్లుతుందని వాహనదారులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *