ఉప ఎన్నికలు సాధ్యమే!నా?

`మూడు నెలలో స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారా!

`స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ రాజీనామా చేస్తారా?

`మంత్రి వర్గ విస్తరణ చేసి మంత్రి వర్గంలోకి గడ్డం ప్రసాద్‌ను తీసుకుంటారా!

`కొత్త స్పీకర్‌తో పిరాంపుల వ్యవహారం మళ్లీ మొదటి తెస్తారా!

`కథ మళ్లీ మొదటికి తెచ్చి కాలయాపన చేస్తారా?

`కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ రకంగా కూడా ముందుకు వెళ్లొచ్చు!

`అధిష్టానం అందుకు ఒప్పుకుంటుందా?

`రేవంత్‌ సర్కార్‌కు అధిష్టానం ఫ్రీ హాండ్‌ ఇస్తుందా?

`పిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తారా?

`ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా కాంగ్రెస్‌ గెలిచే అవకాశం వుందా?

`రాజీనామా చేసినా కాంగ్రెస్‌ పార్టీ అదే అభ్యర్థులను నిలబెడతారన్న గ్యారంటీ వుందా?

`ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు ఏదైనా జరగొచ్చు?

`ఏ మాత్రం తప్పటడుగులు పడినా మొదటికే మోసం రావొచ్చు?

`ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పదవికి గండం కూడా రావొచ్చు?

`పిరాయింపు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే తప్ప కాంగ్రెస్‌ కు భవిష్యత్తు వుండదు.

`ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్‌ పార్టీ ఆచి తూచి అడుగులు వేయాలి.

`సుప్రీం తీర్పు పిరాయింపు ఎమ్మెల్యేలకు అనుకూలమా! వ్యతిరేకమా!?

`సుప్రీం కోర్టు తీర్పులో మళ్ళీ సందిగ్ధత వుందా?

`మూడు నెలలో నిర్ణయం వెలువరించే అవకాశం వుందా!

`స్పీకర్‌ నిర్ణయానికి సుప్రీం కోర్టు కూడా వదిలేసినట్లేనా?

`స్పీకర్‌ ను ఆదేశించే అధికారం కోర్టుకు లేదని చెప్పినట్లా?

`కచ్చితంగా మూడు నెలల టైం తర్వాత ఎమ్మెల్యేలపై వేటు తప్పదా!

`రాజకీయాలలో నైతికతకు ఎప్పుడో తిలోదకాలిచ్చారు!

`ఈ తీర్పుతో మరింత పెరిగే అవకాశం లేదా?

`రాష్ట్రపతి, గవర్నర్‌లకే ఆదేశాలిచ్చిన సుప్రీం కోర్టు?

`స్పీకర్‌ విశేషాదికారాలపై తీర్పు ఇవ్వలేదా?

`పిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్‌ఎస్‌ గూటికి వస్తారా!

`కేసీఆర్‌ తో కాళ్ల బేరానికి వస్తే కనికరిస్తారా?

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:                                              

 పిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పులో బిఆర్‌ఎస్‌ గెలిచిందా? లేక కాంగ్రెస్‌ గెలిచిందా? ఎవరూ చెప్పలేని సందింగ్థ పరిస్ధితి ఎదరౌతోంది. సుప్రిం తీర్పు కర్ర విరక్కుండా, పాము చావకుండా వుందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. సుప్రింకోర్టు చారిత్రకమైన తీర్పునిచ్చిందనడంలో సందేహం లేదు. పార్టీ పిరాయింపులకు చెంపపెట్టులాంటిది. కాని ఈ తీర్పు అమలు జరిగే అవకాశంవుందా? అన్నదే ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్న. ఎందుకంటే కచ్చితంగా పిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని సుప్రింకోర్టు చెప్పలేదు. 3నెలల సమయంలో ఏదొ ఒక నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సుప్రింకోర్టు తన తీర్పులు వెల్లడిరచింది. ఆ మూడు నెలల్లో ఏదైనా జరగొచ్చు. గుడువు ముగిసే సమయంలో అనేక రకాలైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. తీర్పు రిజర్వు చేసిన మూడు నెలల తర్వాత వెలువడిన సుప్రిం తీర్పుపై అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఎమ్మెల్యేలపై వేటు పడుతుందన్న భావన అందరిలోనూ వ్యక్తమైంది. కాని ఇది తుది తీర్పు కాదన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మూడు నెలల్లో స్పీకర్‌ తన నిర్ణయాన్ని వెల్లడిరచకపోయినా, చర్యలు తీసుకోకపోయినా సుప్రింకోర్టు మళ్లీ సుమోటోగా కేసు స్వీకరిస్తామని కూడా చెప్పలేదు. అందుకు వీలు కూడా లేదు. పైగా స్పీకర్‌కు వున్న విచక్షణాదికారాల దృష్ట్యా ఎలాంటి ఆదేశాలు కూడా ఇచ్చే పరిస్ధితులు లేవన్నది తేలిపోయింది. ఆ మధ్య తమిళనాడు ప్రభుత్వం విషయంలో గవర్నర్‌, రాష్ట్రపతి కూడా ఎలాంటి ఫైల్‌నైనా సరే మూడు నెలల్లో నిర్ణయాలు తీసుకోవాలని సుప్రింకోర్టు తీర్పు వెలువరించింది. దానిపైనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. కాని స్పీకర్‌ విషయంలో సుప్రింకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఈ తీర్పు ఒక రకంగా సూచనగానే మిగిలిపోతుందా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కొంత మంది ఈ విషయంలో స్పీకర్‌ కూడా అవసరమైతే అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా వుందంటున్నారు. అప్పుడు మళ్లీ సుప్రింకోర్టు ఏం చెబుతుందన్నది కూడా ఎవరికీ అంతు పట్టకుండా వుంది. సరే స్పీకర్‌ సుప్రింకోర్టు వెలువరించిన తీర్పును శిరసావహించకుండా వుండేందుకు కూడా కొన్ని మార్గాలున్నాయంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు మంత్రి పదవి చేపట్టాలని వుందన్న వార్తలు ఆ మధ్య వచ్చాయి. మంత్రి వర్గ విస్తరణకు ముందు ఇలాంటి వార్త సహజమే అని అందరూ అనుకున్నారు. కాని సుప్రింకోర్టు తీర్పు తర్వాత ఏదో జరుగుతుందన్న ఆలోచన ఎవరికీ రాలేదు. మూడు నెలలకు కొద్ది రోజుల మందు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేస్తే పరిస్దితి ఎలా వుంటుంది? అన్నది కూడా చర్చకు రావొచ్చు. స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ రాజీనామా చేసి, మంత్రి వర్గంలో చేరొచ్చు. అప్పుడు కొత్త స్పీకర్‌ రావడానికి కొంత సమయం పట్టొచ్చు. ఆ తర్వాత వచ్చే స్పీకర్‌ మళ్లీ తాను నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కోరొచ్చు. వచ్చే నవంబర్‌లో సుప్రింకోర్టు ప్రదాన న్యాయమూర్తి గవాయ్‌ పదవీ కాలం ముగుస్తుంది. అలాంటప్పుడు కథ మళ్లీ మొదటికి రావొచ్చు? అని కూడా న్యాయ కోవిదులు అంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేల పిరాయింపులు అనేవి ఇది కొత్తది కాదు. ఇదే ఆఖరు కాదు. అలాంటప్పుడు స్పీకర్‌ నిర్ణయం మరింత ఆలస్యం కావొచ్చు. అంతిమంగా పిరాయింపు ఎమ్మెల్యేల మీద వేటు పడాల్సిందే. కాని అది ఎంత కాలం పట్టొచ్చన్నది ఇప్పటికిప్పుడు ఎవరూ చెప్పలేరు. గతంలో ఉమ్మడిరాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై ఆ శాసన సభ చివరి సమావేశాల చివరి రోజు వేటు వేశారు. ఈసారి అంత దూరం వెళ్లకపోవచ్చు. అయితే తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో సుప్రిం తీర్పు దేశంలో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల కేసులన్నింటికీ వర్తించకపోవచ్చన్నది కూడా తెలుస్తోంది. ఈ కేసు కేవలం తెలంగాణ ఎమ్మెల్యేలకే పరిమితం చేశారు. నిజం చెప్పాలంటే సుప్రింకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును ప్రతి స్పీకర్‌ గౌరవించాలి. న్యాయస్ధానం తీర్పును శిరసావహించాలి. నైతికత కలిగిన ఎమ్మెల్యేలే అయితే వెంటనే రాజీనామా చేయాలి. ఈ రెండు జరిగే పరిస్దితి అయితే ఇప్పటికప్పుడు కనిపించడం లేదు. అటు వేటు వేయడానికి సమయం వుంది. లేదంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నా కూడా అంతే గడువు వుంది. అప్పటి వరకు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అదిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చాలా కీలకమైన అంశం. ఎమ్మెల్యేల చేత వెంటనే రాజీనామా చేయించమని ఆదేశాలు జారీ చేస్తుందా? లేక వేచి చూడమని చెబుతుందా? అనేది కూడా తేలాల్సివుంది. ఎందుకంటే పిరాయింపుల చట్టం తెచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. 10 షెడ్యూల్‌లో పిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. సబ్‌ క్లాస్‌ 141, 136లలో కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు. కాని ఆ చట్టానికి కాళ్లు చేతులు కట్టేశారు అని కూడా అంటారు. ప్రజా ప్రతినిధులు పార్టీ మారిన వెంటనే అనర్హత వేటు పడాలని అంటున్నారే గాని, ఆ చట్టాన్ని ఎవరూ అమలు చేయడం లేదు. చట్టమైతే చేశారు..కాని దానికి పవర్స్‌ ఇవ్వలేదన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇదిలా వుంటే గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతి సభలో ఒక విషయం సూటిగా స్పష్టంగా చెబుతూ వచ్చారు. గెలిచిన తర్వాత ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారితే రాళ్లతో కొట్టండన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందన్న పూర్తి నమ్మకం అప్పుడు కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు. ఒక వేళ గెలుస్తామన్న నమ్మకం వున్నా, తాము బిఆర్‌ఎస్‌ చేసిన తప్పు చేయమని చెప్పి ప్రజల నమ్మించాలనుకున్నారు. కాని అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అదికారంలో వున్నప్పుడు తెచ్చిన పార్టీ పిరాయింపుల చట్టాన్నే కాంగ్రెస్‌ ఉల్లంఘించినట్లైంది. అందువల్ల ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని అదిష్టానం ఆదేశిస్తుందా? అన్నది కూడా ఆ పార్టీ ముందున్న ప్రశ్న. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీ ఈ పది మందిని గెలిపించుకుంటుందా? అన్నది అనుమానమే. పది మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి మరో పదేళ్ల వరకు ఇబ్బంది లేదు. ఎదురు లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వానికి తిరుగుండదు. కాని ఈ పదిమంది ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యే గెలకపోయినా, అది కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పదవీ గండం తెచ్చిపెడుతుంది. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలౌతాయి. ఆదిపత్య రాజకీయం పెరిగిపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌కు, మంత్రులకు మధ్య అగాధం పెరుగుతుంది. ఇలాంటి పరిస్తితి రావడానికి సిఎం.కారణమంటూ నాయకులు అధిష్టానానికి పిర్యాధులు చేస్తారు. ఏ రకంగా చూసినా సుప్రింకోర్టు తీర్పు కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బంది కరమే. కాకపోతే కొంత సమయం తీసుకోవడానికి, ఊపిరి పీల్చుకోవడానికి సమయం దొరికనట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యేల పిరాయింపులపై నైతికంగా బిఆర్‌ఎస్‌కు మాట్లాడే అర్హత లేదు. అప్పటి పరిస్ధితులను బట్టి తీసుకున్నామని చెప్పిన, రెండుసార్లు బిఆర్‌ఎస్‌ చేసింది చట్ట పరంగా కూడా తప్పు. స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించి, ఆ ఎమ్మెల్యేతపై వేటు వేయడమే, లేక ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడమో జరిగితే బిఆర్‌ఎస్‌ గెలిచే సీట్లు ఎన్ని అనేది కూడా చర్చనీయాంశమే. ఈ పది సీట్లలో బిఆర్‌ఎస్‌ అన్ని సీట్లు గెల్చుకోవాలి. అందులో ఒక్కసీటు కోల్పోయినా బిఆర్‌ఎస్‌ బలం పెరిగినట్లు కాదు. కేవలం సానుభూతితో గెలిచినట్లే అవుతుంది. పదికి పది గెలిచినప్పుడే బిఆర్‌ఎస్‌ బలపడిరదన్న సంకేతాలు వెలువడుతాయి. పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం పెరుగుతుంది. బిఆర్‌ఎస్‌ కాకుండా కాంగ్రెస్‌, బిజేపిలు కూడా సీట్లును గెల్చుకుంటే వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు మళ్లీ తిప్పలు తప్పవు. గెలుపు అంత సునాయాసం కాదు. ఈ పది మంది ఎమ్మెల్యేలు మాత్రం గెలిస్తే బిఆర్‌ఎస్‌కు చుక్కలే. కేసుల విషయంలో రేవంత్‌ సర్కారు మరింత దూకుడు పెంచడం ఖాయం. బిఆర్‌ఎస్‌ అధినేత నుంచి మొదలు అందరు నాయకులకు ఇబ్బందులు ఎదుర్కొవడం ఖాయం. ఈ పది సీట్లులలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే వచ్చే ఎన్నికల్లో హీరో..లేకుంటే ఆ పార్టీ జీరో…చూద్దాం..ఏం జరుగుతుందో???

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version