`దూసుకుపోతున్న కారును ఆపేదెవరు?
`కాంగ్రెస్ ను కాపాడేదెవరు? ఒడ్డుకు చేర్చేది ఎవరు?
`మున్సిపాలిటీలలో గులాబీ రెపరెపలు?
`డీలా పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు?
`కాంగ్రెస్ లో కనిపించని పోటీ పోట్లాటలు?
`మున్సిపాలిటీ లో ముందుకు రాలేకపోతున్న కాంగ్రెస్ నాయకులు?
`ప్రజల ముందుకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు?
`ప్రచారానికి చాలా చోట్ల ముఖం చాటేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు?
`కాంగ్రెస్ లో ఎన్నికల కోలాహలం ఎక్కడా కనిపించడం లేదు?
`సొమ్ములు లేక తిప్పలు పడుతున్న నాయకులు?
`ఖర్చులు తడిసిమోపెడౌతాయని కాంగ్రెస్ లో నెలకొన్న దిగులు?
`ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బీఆరఎస్ కు కలిసివచ్చే అవకాశం?
`ఇప్పటికే ప్రచారం లో దూసుకుపోతున్న గులాబీ దళం?
`పెద్ద ఎత్తున మున్సిపాలిటీ లలో గులాబీ లోకి పెరుగుతున్న వలసలు?
`చాప కింద నీరులా బలపడిన బీఆరఎస్ పార్టీ?
`బీఆరఎస్ లో కనిపిస్తున్న విపరీతమైన పోటీ?
`సారే రావాలన్న పాటలతో మారుమొగుతున్న ప్రచారం?
హైదరాబాద్, నేటిధాత్రి:
ఆలస్యం అమతం విషమని కాంగ్రెస్ నాయకులకు, పాలకులకు తెలియందికాదు. కాని ఇప్ప్పుడు తప్పదు. ఇప్ప్పుడు కాకపోతే మరీ విషయమౌతుందని గ్రహించి, హడావుడిగా ఎన్నిÅ£లు నిర్వహిస్తున్నారు. మార్పు మార్పు అంటూ చెప్పిందే చెప్పి, జనం మదిలో నింపి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలవి కాని హమీలను గుప్పించింది. కేసిఆర్ ప్రభుత్వం మీద నీలాపనిందలు వేసింది. ఒక అబద్దం ఒకటికి పదిసార్లు, పదులకు వందలు, వేల సార్లు చెప్పడంతో అది నిజమని నమ్మే పరిస్తితి వుంటుంది. అయినా జనం బలహీనత కూడ అదే కావడం గమనార్హం. నిజం చెబితే ఎవ్వరూ నమ్మరు. నమ్మడానికి ఎంత ప్రయత్నం చేసినా వెంటనే నమ్మరు. కాని అదే అబద్దం చెప్పడం పూర్తికాకముందే అర్ధమైందంటారు. అంత గొప్పది అబద్దం. అదే రాజకీయ పార్టీలకు వరం. అది గత ఎన్నికల్లో కాంగ్రెస్ వరమైంది. కాంగ్రెస్ గెలిచింది. అంత మాత్రానా ఆ అబద్దం నిజం కాని ఎప్పటికైనా తెలియాల్సిందే! జనం తెలుసుకోవాల్సిందే!! ఇప్ప్పుడే కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే తెలుసుకున్నారు. కాని కొంత ఓపిక పట్టారు. ఇక జనంలో కూడా ఆ ఓపికకు టైమ్ అయిపోయింది. దేనికైనా ఒక హద్దు వుంటుంది. ఆ హద్దు కూడా దాటిపోయింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు బిఆరఎస్ ప్రభుత్వం అప్ప్పుల కుప్ప చేసిందని అబద్దమాడింది. అటు అప్ప్పుల కుప్ప వుందంటున్నారు? ఇటు అలవికాని హమీలు ఇస్తున్నారు? ఎలా భర్తీ చేస్తారంటే మాకు ఆర్ధిక వ్యవస్దను ఎలా గాడిలో పెట్టాలో తెలుసు. సంపద ఎలా సష్టించాలో తెలుసు. సష్టించిన సంపద ఎలా ప్రజలకు పంచాలో తెలుసు అన్నారు. కాని ఏమైంది. అదికారంలోకి వచ్చిన వెంటనే లంకెబిందెలున్నాయనుకొని వస్తే, మట్టికుండలు కూడా లేవని చేతులెత్తేశారు. కేసిఆర్ ఫ్రభుత్వం చేసిన అప్ప్పులకే రాష్ట్ర ఆదాయం మిత్తీలకు సరిపోతుందని మళ్లీ కొత్త అబద్దాలు మొదలు పెట్టారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే నిజమనుకుందాం? కేసిఆర్ అటు అప్ప్పులకు మిత్తీలు చెల్లిస్తూనే, సంక్షేమ పధకాలు కూడా అందించారు. రైతు బంధు వేశారు. అన్ని రకాల సదుపాయల కల్పన చేశారు. అభివద్ది, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా ఈమలు చేశారు. అవే కాకుండా తెలంగాణలోని ప్రజలందరికీ కంటి వైద్యం చేయించారు. ఇలా అనేక రకాల కొత్త కొత్త కార్యక్రమాలు అమలు చేశారు. కాంగ్రెస్ రైతు బంధు ఒక్కసారి ఇచ్చి చెతులు దులుపుకున్నది. కల్యాణ లక్ష్మి వంటికి పెళ్లికి ముందే అందిస్తామన్నారు. అందులో లక్ష రూపాయలతోపాటు, తులం బంగారమన్నారు. ఇవ్వాల్సిన లక్ష కూడా పెళ్లి జరిగి, పిల్లలను పట్టుకొని వచ్చి చెక్కులు తీసుకుంటున్నారు. ఇంకా అనేకం పెండింగ్‌లే వున్నాయి. ఇలా చెప్ప్పుకుంటూ పోతే ఎన్నికల హమీలన్నీ అటకెక్కించారు. మహిళలకు ఉచిత బస్తు ఎక్కించి, అదే గొప్ప పధకం అన్నట్లు ప్రచారం చేసుకున్నారు. మీడియా ముందుకు వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేశామని ఏ మాత్రం శషబిషలు లేకుండా చెప్ప్పుకుంటున్నారు. అమలు చేస్తామని చెప్పడం కాదు, ఏకంగా చేసేశామనే చెబుతున్నారు. జనాన్ని ప్రభుత్వ పెద్దలు బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వం చెప్పేది శుద్ద అబద్దమని ప్రజలకు తెలియదా? తెలుసు. ఖజానాలో చిల్లి గవ్వలేదు. నన్ను కోసినా రూపాయి లేదు? అని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుంటే ఇవ్వమని అడగడం ఎందుకు? సమయం వచ్చినప్ప్పుడు దించితే సరిపోతుందని జనం గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఏ ఎన్నిక వచ్చినా తమ తడాఖా చూపించేందుకు జనం సిద్దింగా వున్నారు. ఇప్పటికే పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక దక్కా ఇచ్చారు. అయినా కాంగ్రెస్ ప్రబుత్వంలో మార్పు రాలేదు. రైతులకు సకాలంలో అందాల్సినంత యూరియా అందలేదు. అయినా యాసంగి పంటకు అవసరం వుండదు. సరిగ్గా పంచాయితీ ఎన్నికల ముందు ఎదరైన ఇబ్బందిన రైతులు తమ ఓటుతో చూపించారు. కాంగ్రెస్‌ను హాండిచ్చారు. ఇప్ప్పుడు హడావుడిగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్నారు. సర్పంచ్ ఎన్నికలంటే భిన్నంగా ఎన్నికల పలితాలు వుంటాయన్న ఆశ లేదు. ఇంకా కాలయాపన చేస్తే కాంగ్రెస్ నాయకుల్లో కూడా అసహనం పెరిగే అవకాశం వుంది. వారిలో ఆక్రోశం పెరిగితే మొదటికే మోసం వస్తుందని గ్రహించి, మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్నారు. కాకపోతే కాంగ్రెస్‌కు ప్రజా క్షేత్రంలో ఇబ్బందికరమైన పరిస్దితులే వున్నాయని అంటున్నారు. సహజంగా ఎన్నికýంటే కాంగ్రెస్‌లో సొంత పార్టీ నేతలతోనే కొట్లాటలు, పోట్లాటలు కనిపిస్తాయి. టికెట్ మాకంటే మాకు అని రచ్చ రచ్చ చేసే నాయకులు వుంటారు. కాని మున్పిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు పెద్దగా ముందుకు వస్తున్నట్లు లేదు. పార్టీయే పిలిచి పిలిచి టిక్కెట్లు ఇస్తున్నట్లు చెప్ప్పుకుంటున్నారు. అయినా నాయకులు సుముఖత వ్యక్తం చేయడంలేదనితెలుస్తోంది. ఎన్నికల ఊపు కాంగ్రెస్ నాయకుల్లో లేదంటున్నారు. ప్రభుత్వ వి దానాలు చెప్ప్పుకోవడానికి ఏమీలేవు. ఆర్ధిక పరిపుష్టి వుంటే ఓటర్లను ప్రలోభ పెట్టి గెలవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రచారానికి వెళ్లేంత దైర్యం కూడా నాయకుల్లో లేదు. కార్యకర్తలకు ఆ తీరిక లేదు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా నాయకులకు,కార్యకర్తలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. వారికి వచ్చిన పనులు లేవు. పదవులు లేవు. కాంట్రాక్టులు లేవు. ప్రభుత్వ పరిపాలనా తీరుపై చెప్ప్పుకుందామంటే నిజాలే లేవు. గొప్పలకు తావేలేదు. ఆరు గ్యారెంటీలలో అమలౌతున్న వాటి గురించి కూడా స్పష్టంగా చెప్ప్పుకోలేకపోతున్నారు. చెప్ప్పుకోవాలంటే కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. అర్హలైన వాళ్లందరికీ సిలిండర్ లో సబ్సిడీ అందడం లేదు. అందుతుందని చెబుతున్న వారు కూడా పెద్దగా లేరు. కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్ప్పుకోవడానికి తప్ప ఆ పధకం పూర్తి స్దాయిలో అమలు జరగడం లేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా సక్రమంగా అమలు జరుగుతున్నది లేదనే అంటున్నారు. ఇక మిగతా హమీలేవీ అమలు జరిగింది లేదు. ఆ ఆలోచన ప్రభుత్వంలో లేనే లేదు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇచ్చే పరిస్తితి కనిపించడం లేదు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. వి ద్యార్తులందరకీ రూ.5లక్షల కార్డు ఇస్తామన్నారు. ప్రభుత్వపై ఆదారపడకుండా విద్యార్దుల అకౌంట్లో వేసే సొమ్ముతో ఫీజులు చెల్లించుకోవచ్చన్నారు. కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం అన్నారు. ఇవేవీ సమీప భవిష్యత్తులో కూడా అమలు చేసే పరిస్దితి లేదు. దాంతో మున్పిసల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కాంగ్రెస్ నాయకులు జంకుతున్నారు. అదే సమయంలో బిఆరఎస్ పార్టీ మంచి దూకుడు మీద వుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు జోష్ మీద వున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మున్పిపల్ ఎన్నికల్లో బిఆరఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా సాగుతోంది. ఎందుకంటే మున్సిపాలిటీలలో గత బిఆరఎస్ హాయంలో జరిగిన అభివద్ది తప్ప కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందేమీ లేదు. ప్రస్తుతం బిఆరఎస్ గతంలో చేసిన అభివద్ది గురించి చెప్ప్పుకుంటే చాలు. కొన్ని దశాబ్దాలుగా మంచినీటి కోసం తహతహలాడిన మున్సిపాలిటీలు మిషన్‌భగీరదతో నీటి కటకట అనేది లేకుండాపోయింది. రూపాయికే నల్లా క నెక్షన్ ఇచ్చారు. మున్పీపాలిటీలలో అంతర్గత రోడ్లు, సిసి రోడ్లు, పారిశుద్యం వంటి వాటిని ఎంతో గొప్పగా చేశారు. కాని ఇప్ప్పుడు ఎక్కడ చూసినా అస్తవ్యస్ధంగా వున్న రోడ్లు, కాలనీలు, అపరిషతంగా వున్న సమస్యలు, పారిశుధ్య విధానంలో లోపాలు బిఆరఎస్ పార్టీకి అనుకూలంగా మారే పరిస్తితి వుంటుంది. కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో వెళ్తే అడిగే ప్రశ్నలకు ఎలాగూ వారి వ ద్ద సమాధానం వుండదు. బిఆరఎస్ నాయకులకు ఏలాంటి విషయాల మీద సమాదానం చెప్ప్పుకోవాల్సిన అసవరం వుండదు. ఈ చిన్న గీతనే బిఆరఎస్‌కు పెద్ద మెజార్టీలు సాదించేందుకు కూడా ఆస్కారం వుంటుంది. మెజార్టీ మున్సిపాలిటీలు బిఆరఎస్ కైవసం చేసుకునేందుకు మార్గం పడుతుంది. కాంగ్రెస్‌కు బేజార్ మొదలైంది. హస్తం హతవిదీ అనుకోవాల్సిన పరిస్దితి ఎదురుకానున్నది అని సాక్ష్యాత్తు కాంగ్రెస్ నాయకులే అంటున్నారు.
