పత్రిక ప్రకటన జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ అన్వేష్
వేములవాడ నేటిధాత్రి
వేములవాడ పట్టణంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన శ్యామగుంట కూరగాయల మార్కెట్లో వ్యాపార స్టాల్స్ కేటాయించడం కోసం అర్హత కలిగిన వ్యాపారుల నుంచి తేదీ 26/02/2024 నుండి 04/03/2024 వరకు దరఖాస్తుల కోసం ఆహ్వానం పలకడం జరిగిందని వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు. స్టాల్స్ దరఖాస్తుల కోసం వ్యాపారులకు విధి వ్యాపార లైసెన్సు ఐడి కార్డు కలిగి ఉండాలని అంతేకాకుండా కూరగాయలు/ పూలు/పండ్లు విక్రయం చేసుకోవడానికీ మాత్రమే స్టాల్స్ కేటాయించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు..