ప్రతి మహిళ సమాజాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి ఎంపిటిసి సభ్యులు గాజుల మల్లేశం
ఎండపల్లి,నేటి ధాత్రి
ఎండపల్లి మండలం రాజారాం పల్లి లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు,ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు కానీ. శుక్రవారం రోజు శివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముందస్తుగా ఈ వేడుకలను రాజరాంపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో స్థానిక ఎంపిటిసి సభ్యులు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి వెల్గటూర్ మండల ఎంపీపీ కూనమల్ల లక్ష్మీ లింగయ్య హాజరై, అనంతరం ఎంపీపీ లక్ష్మి మరియు ఎంపిటిసి గాజుల మల్లేశం మాట్లాడుతూ అంతర్జాతీయంగా మహిళలు తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత,సామాజిక మార్పుపై అవగాహన తోపాటు వీటి సాధనకోసం ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే రోజు అని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని మహిళలు అన్నిట్లో మగవారితో సమానమని మహిళను గౌరవించడం మన బాధ్యత అని అన్నారు . మహిళలు తలుచుకుంటే కానిదేది లేదని, ప్రతీ మహిళ సమాజాన్ని నడిపించే శక్తిగా ఎదగాలన్నారు. స్త్రీలను ప్రతీ ఒక్కరు గౌరవించాలని కోరారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మహిళలకు 33 శాతం నుండి 50 శాతం వరకు రిజర్వేషన్ కల్పించేలా సమిష్టిగా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు (సిఏ) లు ఏదుల కల్పన, గాజుల సరిత అంగన్వాడి కార్యకర్తలు మంతెన రజిత, చిత్తారి కళ్యాణి పాఠశాల ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో గ్రామంలోని మహిళలు, పాల్గొన్నారు.