`వారికి తోచిందే గొప్పనుకుంటారు!?
`మనసులో ఒకటి, బైటకు ఒకటి చెబుతారు!

`వారి నాలుకను ఎటైనా తిప్పేస్తుంటారు!
`రాజకీయ పండితులుగా చెలామణి అవుతుంటారు!
`నాలుగు పుస్తకాలు చదివి విజ్ఞాన గనులనుకుంటారు!ªª
`సమాజానికి పాఠాలు చెబుతారు.. గుణపాఠాలు చెబుతుంటారు!
`వాళ్ళ మాటలను లెక్క చేయని వారిని దూషిస్తుంటారు!
`కళ్ళ ముందు నిజాలను సమాధి చేస్తుంటారు.
`వ్యవస్థ మా వల్లనే ముందుకు సాగుతుందనుకుంటారు.
`వాళ్ళు లేకపోతే సమాజం ఏమైపోయేదో అనుకుంటారు.
`వాళ్ళనుకున్నది జరిగితే విజయం మాదే అని జబ్బలు చర్చుకుంటారు.
`అల్పులవలే అవార్డులకు పొంగిపోతారు.
`అబద్దాల ముసుగేసుకొని ఊరేగుతుంటారు.
`కాలాన్ని బట్టి మనసు మార్చుకుంటారు!
`ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పిందే నిజమనుకుంటారు!
`కాలం మారితే అన్ని పరిస్థితులు మారవు!
`కాలాన్ని బట్టి మనిషి మారకపోతే బతకలేడు!
`సామాన్యుడి పక్షాన నిలిచినట్లు నటిస్తుంటారు.
`రాజకీయాలు, మీడియా తమ చుట్టూ తిరగాలని కోరుకుంటారు.
`నెత్తిన పెట్టుకునే వారి పల్లకి మోస్తుంటారు.
`నెత్తిన పెట్టుకోకపోతే నిందలేస్తూ కాలం గడుపుతుంటారు.
`ఒక్క మాటలో చెప్పాలంటే వారి వల్ల సమాజానికి పైసా లాభం వుండదు.
`పేద వారి గురించి మాట్లాడుతూ కారు దిగలేనంత గొప్పగా బతుకుతుంటారు.
`నిజమైన మేధావులు అర్ధకాలితో మాడిపోతుంటారు.
`ఎందరో అసలైన మేధావులను ఆకలి కబలించింది.
`అబద్దాల మేధావులకు విలాసం తోడుగా నిలుస్తోంది.
`అసత్య ప్రచార యావ వున్న మేధావులు చొక్కా నలగనంత గొప్పగా బతుకుతుంటారు.
హైదరాబాద్, నేటిధాత్రి:
మేధావులు, మేథావులు అని పెద్దలు ఊరికే అనలేదు. వారిని విశ్లేషించడంలో కూడా మేధావులు, సూడో మేధావులు అని కూడా మన పెద్దలే సెలవిచ్చారు. అందుకే ఎవరు మేదావులో, ఎవరు సూడోమేధావులో కూడా అర్దం చేసుకోవాల్సిన అసవరం వుంది. నిజం చెప్పాలంటే మేదావులు అనేవారు కనకంలా వుంటారు. కాని బతుకంతా నరకంగా వుంటుంది. సూడో మేదావులు కంచులా వుంటారు. బతుకంతా సప్ప్పుడుతో కళకళలాడుతుంది. ఇప్ప్పుడున్న మేధావులు అనే పిలువబడే వారిలో అసలై మేధావులు ఎక్కడున్నారో కూడా బూతద్దం పెట్టినా వెతికినా కనించరు. ఎందుకంటే ఈ సూడో మేదావుల ముందు తమను తాము తక్కువ చేసుకోలేక, ఆత్మాభిమానం చంపుకోలేక వాళ్లు బైటకు రావడం లేదు. కాని సూడోమేధావులు ఎప్ప్పుడూ జనంలోనే వుంటారు. కాని జనం మమేకమైనట్లు కనిపిస్తారు. కాని జనం వేరు, తాము వేరు అనే ముసుగులో వుంటారు. ఇది నిజం. ఇదే నిజం. ఎందుకంటే తమకు వ్యక్తి తెలుసు. వ్యక్తిత్వం తెలుసు. వ్యక్తులు తెలుసు. సమాజం తెలుసు. వ్యవస్దలు తెలుసు. అన్నీ తెలుసు. మాకు మాత్రమే అన్ని తెలుసున్న భ్రమల్లో వుంటారు. మేధావులుగా చెలామణి అవుతుంటారు. మిగతా వాళ్లను అమాయకులు అంటూ సంబోధిస్తూ పరోక్షంగా ప్రజలందరికీ ఏమీ తెలియన్న భావనలో వుంటారు. సామాన్యుడికన్నా మేధావి ఎవరూ వుండరు. వారి ఆలోచనలు ఆకాశాన్ని దాటి పోయేంతగొప్పగా వుంటాయి. కాని వారి మాటలు ఎవరూ వినరు. నమ్మరు. ఎందుకంటే వారికి చదువు వుండదు. మన సమాజంలో ఆకలిగా వుందనే వారిని చీ పొమ్మంటారు. అడుక్కుతినేవాళ్లు ఎక్కువయ్యారని చీదరించకుంటారు. అదే మేధావి ముసుగులో వున్న వారు సమాజం అకలితో వుంది. వ్యవస్ధ ఆకలితో అల్లాడిపోతోంది. మన చుట్టూ ఎంతో మంది అర్ధాకలితో జీవిస్తున్నారు. అని చెప్పే వాడిని మాత్రం మేధావి అని గౌరవిస్తారు. ఆకలిగొన్న వాడికి పట్టెడన్నం ఏనాడు పెట్టని వాడు కూడా పేద వారి ఆకలి గురించి మాట్లాడితే మేదావి అవుతాడు. ఇదీ మేదావుల అసలు రూపం. మేదావి ముసుగులో వున్నవాళ్లలో ఎక్కువ శాతం విద్యావంతులు. ఉన్నత ఉద్యోగాలు చేసేవారు. ýక్షల రూపాయాల జీతాలు తీసుకునేవారు. వాళ్లు సమాజం గురించి మాట్లాడుతుంటే అందరూ వినాలనుకుంటారు. కాని లక్షల రూపాయలు జీతాలు తీసుకునే మేధావులు ఎవ్వరూ మానవత్వం వున్నవాళ్లు కాదు. వారికి అందే జీతంలో కొంత భాగం పేదల కోసం ఖర్చు చేసేవారు కాదు. కాని ప్రభుత్వాలు ఇలా చేయాలి? అలా చేయాలి? అని నీతులు చెబుతుంటారు. సంపన్నుల తమ సంపదను పేదలకు పంచాలని సూచిస్తుంటారు. ప్రభుత్వాలు పేదలను వంచిస్తోంటారు. తాను సమాజంలో ఒక వ్యక్తినే, నేను మానవత్వం చాటుకుంటానని మాత్రం రూపాయి ఇవ్వరు. ఉచిత సలహాలు పారేస్తుంటారు. నిజం చెప్పాలంటే మేధావి ముసుగులో వున్నవారు ఎవరూ నిజాలు చెప్పరు. నిజం మాట్లాడుతున్నామన్న భ్రమల్లో వుంటారు. నోరు తెరిస్తే ఆత్మాద్రోహం చేసుకుంటూ అuద్దాలు వల్లిస్తుంటారు. మనసులో ఒకటి వుంటే, బైటకు మరొకటి మాట్లాడుతుంటారు. వారి నాలుకను ఎటువైపైనా తిప్పేస్తుంటారు. ఉమ్మడి తెలంగాణలో ఓ మేదావి తెలంగాణ ఇస్తే మిన్ను విరిగి మీద పడుతుందా? అని ప్రశ్నిస్తూనే విడిపోతే బలం తగ్గుతుందని సన్నాయి నొక్కులు నొక్కారు. ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్ప్పుడు అభివద్ది అంతా ఒక్క హైదరాబాద్‌లో కేంద్రీకతమైతే మిగతా ప్రాంతాలు అన్యాయానికి గురౌతాయని చెబుతూ వచ్చారు. తర్వాత ఏపి ఏర్పాడిన తర్వాత అమరావతి విషయంలో అదే మాట అన్నారు. తర్వాత మూడు రాజధానులను సమర్ధించారు. ఇప్ప్పుడు మళ్లీ రాజదాని లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఒకే వ్యక్తి. ఇన్ని రకాల మాటలు మాట్లాడుతూ, ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంటారు. ప్రతి యువత గొప్ప ఉద్యోగిని కావాలి. ప్రజా సేవ చేయాలి. తన జీవితం సెటిల్ కావాలని కోరుకుంటారు. వైద్య వత్తి చదవిన ఆ మేధావి, ఐఏఎస్ అయ్యారు. కాని ఈ తరం యువత సివిల్‌సర్వీసెస్ వైపు వెళ్లడం విడ్డూరమని అంటుంటారు. సివిల్ సర్వీసెస్ చదవి, ప్రజలకు సేవ చేస్తానని ఐఏఎస్ అయ్యి వ్యవస్ధ మీద విరక్తితో రాజీనామా చేసి, రాజకీయ నాయకుడయ్యారు. పార్టీ ఏర్పాటు చేశారు. అవినీతి నిర్మూలన చేస్తామన్నారు. కాని ఏమైంది. జనం నమ్మకపోవడంతో మళ్లీ మేధావిగా జనం ముందు తనకు తోచించి చెబుతుంటారు. జనమంతా ఒకటి అనుకుంటుంటే, అందుకు భిన్నంగా మాట్లాడుతూ జనాన్ని తప్ప్పు పడుతుంటారు. తాజాగా మహిళా రిజర్వేషన్, డీ లిమిటేషన్ విషయంలోనూ ఇదే లాజిక్ లేని మాటలు మాట్లాడుతున్నారు. మహిళా బిల్లు తెవాలనుకుంటున్న పార్టీలు గత ఎన్నికల్లో ఎందుకు మహిళలకు సీట్లు ఇవ్వలేదని ప్రశ్నించరు. ఏ ప్రభుత్వం పాలనలో వుంటే ఆ పాలనకు సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. సమాన్యుల మీద పడే భారాలను ఏనాడు ఆ మేధావి ప్రశ్నించరు. ఇలా తెలంగాణలో తిష్టవేసుకున్న మేధావులు చాలా మంది వున్నారు. తెలంగాణకు వరప్రదాయినిగా మారిన కాళేశ్వర నిర్మాణం దండగంటూ వచ్చారు. కాళేశ్వరం తెల్ల ఏనుగన్నారు. కాని ఏనాడు తెలంగాణకు ఉమ్మడి పాలకులు నీళ్లివ్వాలని కోరింది లేదు. మేధావులుగా కోరుకున్నది లేదు. తెలంగాణలో వున్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆనాడు కోరిన వాళ్లు కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లెలా వచ్చాయన్నదానిని గుర్తించరు. కేసిఆర్ నీళ్లెలా ఇచ్చాడన్నదానిపై ప్రజలకు నిజాలు చెప్పరు. తెలంగాణ ఇలా అన్నపూర్ణగా మారడానికి కారణాలు చెప్పడానికి వారికి నోరు రాదు. కాలేశ్వరం మాత్రం పనికి రాదంటూ సూడో మేదావులు చెబుతుంటారు. తెలంగానలో వుంటారు. ఇంకా తెలంగాణ మీద పడి ఏడుస్తారు. తెలంగాణ బాగు పడడం చూడలేరు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో విద్యా వ్యవస్దకు ఎలాంటి మూల్యాంకనం అవసరమన్నదానిపై కమిటీ వేసి దానికి చైర్మన్‌ను చేసి బాద్యతలు అప్పగిస్తే ఆ కర్తవ్యం నిర్వహించిన వాళ్లే విద్యా వ్యవస్థమీద నిత్యం మాట్లాడుతుంటారు. వయో వద్దులైనా నిజాలు చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడకుండా మాట్లాడుతుంటారు. కేసిఆర్ రాష్ట్రాన్ని అప్ప్పుల పాలు చేశాడంటారు. నిజంగా ఎక్కడైనా అవినీతి గత ప్రభుత్వంలో జరిగితే నిలదీయాల్సిందే. నిందించాల్సిందే. ప్రభుత్వాలను సన్మార్గంలో పెట్టాల్సిందే. అంతే కాని వారి మనసులో వున్నదానికి ఎల్ల కాలం కక్కేందుకు కూడా వెనుకాడని సూడో మేదావులు వున్నారు. మొత్తం కేసిఆర్ చేసిన అప్ప్పులపై అటు కేంద్రం, ఇటు కాగ్ అనేక సార్లు చెప్పింది. ప్రస్తుతం రెండు సంవత్సరాల కాలంలో చేసిన అప్ప్పులపై ప్రభుత్వమే స్పష్టత ఇ చ్చింది. అయినా సూడో మేధావులు కేసిఆర్ అప్ప్పులు చేశాడని, రాష్ట్రాన్ని అప్ప్పుల పాలు చేశాడని రాజకీయ నాయకులుగా మాట్లాడుతుంటారు. ఆనాడు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనపై రకరకాల వ్యాఖ్యలు చేశారు. మార్పు రావాలని యువతకు సూచించారు. మరి ఇప్ప్పుడేం చేస్తున్నారు..ఇంకా గత కాలాన్ని గుర్తు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇక తెలంగాణ జాతి పిత మీద లేని పోని వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్ల పేర్లు తెరమీదకు తెస్తారు. ఆఖరుగా కేసిఆర్‌ను నిందిస్తుంటారు. కేసిఆర్ ఏమైనా నేను తెలంగాణ జాతి పితను అని చెప్పారా? అలా పిలవమని కోరారా? నాయకులు, అభిమానులు అలా సంబోధిస్తే కేసిఆర్‌కు ఏం సంబంధం? పైగా తెలంగాణ సకల జనుల సమ్మె వల్లనే వచ్చింది. అది కాదని కేసిఆర్ కూడా ఎప్ప్పుడూ చెప్పలేదు. కాకపోతే కేసిఆర్ చేసిన ఉద్యమం, త్యాగం, ఆమరణ నిరసన దీక్ష లేకుండానే తెలంగాణ ప్రకటన వచ్చిందా? పార్లమెంటు సాక్షిగా ప్రకటన వెలువడిందా? అర్దరాత్రి స్వతంత్రం వచ్చినట్లు డిసెంబర్ 9న తెలంగాణ అప్పటి కేంద్రం ప్రకటించిందా? తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకుంటే ఐదేళ్లు కేసిఆర్ రకరకాల ఉద్యమ స్వరూపాలను నిర్మాణం చేయలేదా? డిసెంబర్ 9 ప్రకటన మాత్రం కేవలం కేసిఆర్ ఆమరణ దీక్ష వల్ల వచ్చింది కాదా? నిజాన్ని ఒప్ప్పుకోలేరు. మేధావులు ఇచ్చిన నాలుగు ఉపన్యాసాల మూలంగానే తెలంగాణ వచ్చిందా? పత్రికల్లో రాసిన నాలుగు వ్యాసాలతోనే వచ్చిందా? కేవలం ఒక్క రచయితలు, గాయకులతోనే వచ్చిందా? ఒక్క విద్యార్థులు వల్లనే వచ్చిందా? అందరి బాగస్వామ్యం వుంది. కాకపోతే కేసిఆర్ బాగస్వామ్యం సింహభాగం వుంది. అది గుర్తించలేని, చెప్పలేని సూడో మేదావుల మూలంగానే తెలంగాణ అప్ప్పుడైనా, ఎప్ప్పుడైనా జఠిలమైంది. కేసిఆర్ మూలంగానే తెలంగాణ కల సాకారమైంది. అంతిమంగా కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్‌లోనూ తెలంగాణ వాదులున్నారు. వాళ్లు కూడా గట్టిగానే కొట్లాడారు. వారి శక్తికి మించి కొట్లాడిన వాళ్లు కూడా వున్నారు. వారిని పోరాటాన్ని ఎవరూ తక్కువ చేయడంలేదు. కాని ఈ మధ్యలేనిపోని వివాదాలు సష్టించేది కూడా ఈ సూడో మేధావులే.