జగిత్యాల రూరల్ చలిగల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి
రాయికల్, ఆగస్టు 9, నేటి ధాత్రి:
మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి గత దశాబ్ద కాలం గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా స్తంభించిపోయింది ఒక విధంగా గృహ నిర్మాణ శాఖను రద్దు చేశారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2004 -2014 మధ్యకాలంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా స్యాచిరేషన్ ప్రాతిపదికన ఇల్లు లేని వంటి పతి నిరుపేదను ఒక ఇంటివారిని చేయాలని లక్ష్యం తో రాజకీయాలకు అతీతంగా గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టబడడం జరిగింది మళ్లీ ఈరోజు రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా వారిని గుర్తించి పెరిగిన విలువలకు అనుగుణంగా ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయబడే విధంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల నిర్మాణం మొదటి విడతగా తొలి దశలో చేపట్టడం జరుగుతుంది రాష్ట్రంలో దాదాపు 4 లక్షల పైచిలుకు ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందిదశలవారీగా రాబోయే 3 సంవత్సరాలలో మొత్తం రాష్ట్రం లోపల ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరూ లేకుండా అందరిని ఒక ఇంటి వారిని చేయాలని లక్ష్యంతోని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం ఆనాడు ఏ ఇందిరమ్మ తల్లి సమాజంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరు ఉండకూడదని గ్రామ గ్రామాన స్థలాలు సేకరింపచేసి గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టబడడం జరిగిందిఈరోజు అదే విధంగా ఇల్లులేని నిరుపేద వర్గాల వారి అందరికీ కూడా 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణ కార్యక్రమం చేపట్టబడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబడడం అందులో భాగంగానే చలిగల్ గ్రామంలో ఇంటి నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగిందిలబ్ధిదారులు అందరు కూడా 400 గజాల నుండి 600 గజాల లోపు చేసుకోవాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్ చలిగళ్ గ్రామంతో పాటు రూరల్ మండలం లో ప్రధానంగా బాధ్యతలు తీసుకొని నిరుపేద వర్గాల వారందరికీ అండగా నిలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని అమలు చేయబడే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు అభినందిస్తున్నాను వారికి తోడుగా నిలుస్తున్న పెద్దన్న కి వెంకన్న కి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను గ్రామ పంచాయతీ కార్యదర్శిలు కూడా చాలా బాగా పని చేస్తున్నారు లబ్దిదారులకు సూచనలు ఇస్తూ వారికి తోడుగా నిలుస్తున్నారు…