ఇందిరా గాంధీ రాజకీయ ప్రస్థానం మరెందరికో స్ఫూర్తి

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కళ్లపెల్లి రాజు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు మాట్లాడుతూ ఇందిరా గాంధీ రాజకీయ ప్రస్థానం మరెందరికో స్ఫూర్తి అని అన్నారు. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా. ఆయన ఇందిరాగాంధీకి నివాళులు అర్పించారు అనంతరం తక్కలపల్లి రాజు మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారతరత్న ఇందిరాగాంధీ కలలు సాకారం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఉక్కుమనిషి ఇందిరాగాంధీ హరిత విప్లవం పేదరిక నిర్మూలనకై కృషిచేసిన భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ అని ఆమె జీవితం దేశ మహిళలకు ఆదర్శంగా నిలిచిందని ఒక్కో మెట్టు ఎక్కుతూ దేశ ప్రధమ మహిళ ప్రధానిగా ఆమె సాగించిన రాజకీయ ప్రస్థానం ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. నాలుగు పర్యాయాలు ప్రధానిగా ఇందిరా గాంధీ తన పాలన కాలంలో తీసుకున్న నిర్ణయాలు మన దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాయని ఆమెను స్మరించుకుంటూ. జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version