ఇండిగో విమానాల రద్దు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం..

ఇండిగో విమానాల రద్దు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం

 

ఇండిగో విమానాల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు అండగా రైల్వే శాఖ రంగంలోకి దిగింది. పలు మార్గాల్లో అదనపు రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రైళ్లకు అదనపు ఏసీ బోగీలను జోడించింది. రాబోయే రోజుల్లో వీటిని మరింత విస్తరిస్తామని అధికారులు తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో విమానాల రద్దుతో సతమతమవుతున్న ప్రయాణికులను ఆదుకునేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది. విమాన ప్రయాణికుల కోసం శనివారం రైల్వే శాఖ పలుమార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రైళ్లకు అదనపు బోగీలను జత చేసింది. ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు తగినన్ని లేక అవస్థలు పడుతున్న విమానయాన ప్రయాణికుల కోసం రైల్వే ఈ చర్య తీసుకుంది. రానున్న రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తేనుంది (IndiGo Fiasco – Indian Railways Special Trains).సెంట్రల్, వెస్టర్న్, నార్త్ వెస్టర్న్, ఈస్టర్న్ రైల్వే పరిధిలో పలు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే పుణె-బెంగళూరు, పుణె-ఢిల్లీ, ముంబై-న్యూఢిల్లీ, ముంబై-గోవా, లఖ్నవూ-ముంబై, నాగ్‌పూర్-ముంబై, గోరఖ్‌పూర్-ముంబై రూట్‌లలో ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

డిసెంబర్ 6 న బయలుదేరి డిసెంబర్ 8న తిరుగు ప్రయాణమయ్యేలా తూర్పు రైల్వే హౌరా-న్యూఢిల్లీ రూట్‌లో ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది. పశ్చిమతీరం వెంబడి ముంబై-మడ్గావ్ రూట్‌లో డిసెంబర్ 7న మరో ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. హాలిడే, వారాంతాల రద్దీని దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రవేశపెట్టారు. ఎప్పటికప్పుడు డిమాండ్‌ను పరిశీలిస్తూ అదనపు రైళ్లను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version