మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
పాలమూరు పట్టణ కేంద్రంలోని తెలంగాణ వాల్మీకి సంగం ఆధ్వర్యంలో కృతజ్ఞత శోభాయాత్ర నిర్వహించడం జరిగింది.
శోభయాత్రకి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బిజెపి రాష్ట్ర నాయకులు ఏపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు మిథున్ రెడ్డి మాట్లాడుతూ, అయోధ్యలోని శ్రీరామ క్షేత్రంలో విమానాశ్రయానికి వాల్మీకి మహర్షి నామకరణం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ కి మరియు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
శోభ యాత్రలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు మరియు మండల నాయకులు వాల్మీకి సోదరులు, సోదరీమణులు, చిన్నారులు మరియు హిందూ బంధువులు, తదితరులు పాల్గొన్నారు.