2030 కామన్వెల్త్ గేమ్స్ బిడ్‌కు IOA ఆమోదం..
భారత ఒలింపిక్ సంఘం (IOA) 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత బిడ్‌ను అధికారికంగా ఆమోదించింది. బుధవారం న్యూఢిల్లీ లో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (SGM) లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే భారత్, అహ్మదాబాద్‌ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదిస్తూ Expression of Interest సమర్పించింది. ఆగస్టు 31లోపు తుది బిడ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
కెనడా పోటీ నుండి తప్పుకోవడంతో భారతావకాశాలు మరింత పెరిగాయి. ఇటీవల కామన్వెల్త్ స్పోర్ట్ డైరెక్టర్ ఆఫ్ గేమ్స్ డారెన్ హాల్ నేతృత్వంలోని బృందం అహ్మదాబాద్‌ను సందర్శించి, వేదికలను పరిశీలించి, గుజరాత్ ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది. ఈ నెల చివర్లో మరింత పెద్ద ప్రతినిధి బృందం తిరిగి సందర్శించనుంది.