భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది.. పాక్ అధ్యక్షుడి సంచలన ఆరోపణలు..

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది.. పాక్ అధ్యక్షుడి సంచలన ఆరోపణలు..

భారతదేశం మరో యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు. పాకిస్థాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో మాట్లాడిన జర్దారీ.. భారతదేశం ఇస్లామాబాద్‌తో మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపించారు.

భారతదేశం మరో యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు. పాకిస్థాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో మాట్లాడిన జర్దారీ.. భారతదేశం ఇస్లామాబాద్‌తో మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపించారు. యుద్ధం విషయంలో న్యూఢిల్లీ వెనక్కి తగ్గి శాంతియుత చర్చలకు రావాలని పిలుపునిచ్చారు (Pakistan President statement).
‘భారత నాయకులు మరో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. వారికి నా సందేశం ఏమిటంటే.. యుద్ధ ఆలోచనల నుంచి అర్థవంతమైన చర్చల వైపునకు మళ్లండి. ప్రాంతీయ భద్రతకు అదే ఏకైక మార్గం’ అని జర్దారీ అన్నారు. పాక్ పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version