నస్పూర్ లో శ్రీ సన్ షైన్ నూతన ఆస్పత్రి ప్రారంభోత్సవం….

నస్పూర్ లో శ్రీ సన్ షైన్ నూతన ఆస్పత్రి ప్రారంభోత్సవం

అన్ని వసతులతో నాణ్యమైన వైద్యం

ఆస్పత్రి నిర్వహకులు బోరిగం వెంకటేష్

నస్పూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో శ్రీ సన్ షైన్ నూతన ఆస్పత్రిని నగర డిప్యూటీ మేయర్ సల్ల రమ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు బోరిగం వెంకటేష్ మాట్లాడుతూ సింగరేణి కోల్డ్ బెల్ట్ ప్రాంత ప్రజలకు అన్ని అధునాతన వసతులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ని ప్రారంభించినట్లు తెలిపారు.24 గంటల వైద్య సేవలు ప్రత్యేక వైద్య నిపుణులైన వైద్యులతో అస్పత్రి లో వైద్యం సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రజలకు అందుబాటులో ఉండేలాగా నస్పూర్ లో ఆస్పత్రి ప్రారంభించమన్నారు.అనంతరం అస్పత్రిలోని వివిధ విభాగల గదలను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జగన్ మోహన్ రావు ప్రారంభించారు.ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ ను ఆస్పత్రి నిర్వహకులు బోరిగం శ్రీనివాస్,వెంకటేష్ లు ప్రారంభించారు.ఆస్పత్రి వైద్యులు పెడియాట్రిక్ సానా సుమలత ఓపి వైద్య సేవలు ప్రారంభించి ఈ వైద్య సేవలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆస్పత్రి చైర్మన్ బోరిగం రాజారాం,ఆస్పత్రి నిర్వహకులు బోరిగం శ్రీనివాస్,కార్పొరేటర్లు ఖలీద్, రాచకొండ గోపాలరావు,సుదమల్ల హరికృష్ణ,శ్రీపతి శ్రీనివాస్,నస్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్,ఐఎంఐ అధ్యక్షులు రవి ప్రసాద్,కోశాధికారి సంతోష్,కార్యదర్శి అనిల్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,కెమిస్ట్ డ్రగ్జిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి తొగరు సుధాకర్,కోశాధికారి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version