వయోజన విద్యా కేంద్రాలు ప్రారంభోత్సవం
ములుగు జిల్లా, నేటిధాత్రి:
భారత దేశములో జ్యోతిరావు పూలే వయోజనుల పట్ల, చేసిన సేవలు ఎంతో అభినంద నీయమని గ్రేస్ అండ్ పీస్ ఫౌండేషన్ సెక్రటరీ మరియు వయోజన విద్యా కేంద్రాల ప్రాజెక్టు అధికారి పి. శాంతికుమార్ కొనియాడారు. లీటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారి సహకారముతో
15 వయోజన విద్య కేంద్రాలను ఏర్పాటు చేయుటకు సంతోషిస్తున్నామని వయోజనులను అక్షరాశ్యులుగా చేసి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని, మహిళలను అక్షరాస్యులుగా చేసి, జ్ఞానోదయం కలుగ చేసి సమాజములో చైతన్య వంతులుగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశ్యంతో జ్యోతిరావు పూలె మొట్ట మొదటిసారిగా వయోజన విద్య కేంద్రాలను ప్రారంభించారని కొనియాడారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిదులుగా గ్రేస్ అండ్ పీస్ ఫౌండేషన్ అధ్యక్షులు పోగుల. సుదర్శనరావు, శాంతికుమార్, పి. డి. లవనిక మేడం, జి. పి. ఎస్. సూర్య . పఠాన్ , విల్టన్, రవి, రాంబాబు. విజయ, శేఖర్, పద్మ, కరుణ, అరుణ, ప్రమీల, లూదియ. టీచర్ పాల్గొన్నారు.
