మే డే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి

# ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు.

నర్సంపేట,నేటిధాత్రి :

మే డే స్ఫూర్తితో మతోన్మాద కార్పొరేట్ గుత్తా పెట్టుబడిదారులకు రాబోయే ఎన్నికల్లో కార్మిక వర్గం తగిన గుణపాఠం చెప్పాలని సీఐటియి జిల్లా నాయకులు అనంతగిరి రవి అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాలు అధ్యక్షులు రుద్రారపు పైడయ్య అధ్యక్షతన నర్సంపేట పట్టణంలో జరిగాయి. ఈ సందర్భంగా అనంతగిరి రవి మాట్లాడుతూ 1886లో అమెరికా చికాగో నగరం హే మార్కెట్ లో జరిగిన 8 గంటల పని హక్కు కోసం జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితో నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మేడే కార్మిక హక్కులను నిలబెడుతున్నదని కానీ నేడు ప్రపంచీకరణలో భాగంగా గుత్తా పెట్టుబడుదారి కార్పొరేట్ సంస్థలు శ్రమ చేసే కార్మికుల శ్రమను దోపిడీ చేయడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా కులమత రంగు, లింగ వివక్షతో కార్మిక వర్గాన్ని విభజించి దోపిడీ చేస్తుందని ఆరోపించారు.రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేస్తూ దేశాన్ని ఫాసిజం వైపు తీసుకు వెళుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దింపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ సిఐటియు నాయకులు కందికొండ రాజు, ఓదెల చంద్రయ్య, దేవాన్ల రాంబాబు, లక్క నరేందర్, అడప వేణుగోపాల్, నెలకంటి కుమార్, పులిచేరి గోపి, పాలకుర్తి మధు, పెరుమాళ్ళ సాంబయ్య, జగన్నాథం, కార్తీక్, ఎండి మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version