34 వరకు సీఎం.. తర్వాత పీఎం!

`రాసి పెట్టుకోండి..వీడియో దాచి పెట్టుకోండి.

`నేనే రాజు..నేనే మంత్రి అని చెప్పిన ధైర్యవంతుడు

`సీఎం రేవంత్ రెడ్డి కొత్త లక్ష్యం.

`ఈ పదేళ్లు తెలంగాణాకు రేవంత్ రెడ్డే సిఎం.

`రేవంత్ రెడ్డి నోటి వెంట మరో సారి స్పష్టం.

`ఇప్పటికే ఈ విషయం పదుల సార్లు చెప్పిన సిఎం.

`సీఎం అయిన తొలి రోజునుంచి ఇదే మాట పదే పదే చెప్పడం.

`అధిష్టానం కూడా మౌనం అంగీకారం.

`సీఎం రేవంత్ రెడ్డి మీద అధిష్టానానికి ఎంతో నమ్మకం.

`పార్టీని అధికారం లోకి తీసుకొచ్చే శక్తి వున్న ఏకైక నాయకత్వం సీఎం.

`ఇప్పటికే తన మాట నిల బెట్టుకున్నారు.

`పార్టీని అధికారం లోకి తీసుకొస్తానని మాట ఇచ్చారు.

`అన్నట్లుగానే గత ఎన్నికలలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు.

`వచ్చే ఎన్నికలలో కూడా అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పారు.

`మళ్ళీ నేనే సిఎం.. పదేళ్లు పాలన నాకే సొంతం.

`రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు అధిష్టానంకు కూడా తెలుసు.

`పదేళ్ల తర్వాత కూడా మూడో సారి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారం లోకి తెస్తా!

`జాతీయ రాజకీయాలలోకి వెళ్తా..

`రేవంత్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడు.

`20 ఏళ్ల క్రితమే తాను సీఎం అవుతా అని ప్రకటించారు.

`అప్పుడు చాలా మంది నాయకులు రేవంత్ వైపు జాలిగా చూశారు.

`అదే నాయకులు రేవంత్ అనుకున్నది సాధిస్తాడని కొనియాడుతున్నారు.

`2034 తర్వాత పీఎం కూడా కావొచ్చని అనుకుంటున్నారు.

`కాంగ్రెస్ పార్టీలో కనిపించే ఏకైక దీరుడు.

`ఇలా చెప్పిన వారు గతంలో కాంగ్రెస్ లో ఎవరూ లేరు.

`పెద్ద పెద్ద నాయకులు కూడా తమ లక్ష్యన్ని ఇలా చెప్పలేదు.

హైదరాబాద్, నేటిధాత్రి:

చెప్పే మాట , వేసే అడుగు స్పష్టంగా వుండాలి. ఆత్మవిశ్వాసం నిండిందై వుండాలి. అంతే కాకుండా నాయకుడు అనేవారు మాట తప్ప కుండా మడమ తిప్పకుండా వుండాలి. ప్రజలకు ఇచ్చిన మాటనే కాదు, తన హృదయానికి చెప్ప్పుకున్న మాట కూడా మర్చిపోకూడదు. అప్ప్పుడే ఆ నాయకుడు వెలుగొందుతాడు. ప్రజా నాయకుడౌతారు. అలా పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసం నిండిన నాయకుడిగా తెలంగాణ సిఎం. రేవంత్ రెడ్డి కనిపిస్తారు. రాజకీయాల్లోకి రావాలనుకునే నేటి తరం యువత ఆయన మాటను అనుసరిస్తే చాలు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం వుండాలి. ఆ లక్ష్య సాధన కోసం కలలు గనడం కాదు, కార్యాచరణ వుండాలి. అప్ప్పుడే విజయం వరిస్తుంది. అలా చిన్న నాడే సిఎం. రేవంత్‌రెడ్డి తన లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. అడుగులు వేయడం మొదలు పెట్టారు. ఎక్కడా అలసిపోలేదు. అలుపు కోరుకోలేదు. వెనక్కి తిరిగి చూడాలనుకోలేదు. పర్వతం ఎక్కాలనుకున్నప్ప్పుడు రాళ్లు, రప్పలు అనేకం వుంటాయి. అడవి దాటాలనుకున్నప్ప్పుడు ముళ్లదారులే కనిపిస్తాయి. క్రూర మృగాలు కూడా ఎదురొస్తాయి. వాటి నుంచి తప్పించుకొని వెళ్లాలి. రాజకీయాలు కూడా అంతే. ఆ మార్గం అంత సులువైంది కాదు. రాచ బాట అసలే కాదు. లక్షల మందిలో ఏ ఒక్కరికో దారి పడినా, ప్రతిసారి గెలవడం అనేది అందరికీ సాద్యం కాదు. అలా ఒక లక్ష్యాన్ని నిర్ధేశించకున్న ఏకైక నాయకుడు తెలంగాణ రాజకీయాల్లో సిఎం. రేవంత్‌రెడ్డి మాత్రమే. రాజకీయాల్లో చేరిన వారంతా ఉన్నత స్ధానం చేరుకోవాలనుకుంటారు. కాని రేవంత్‌రెడ్డి అంతుకు భిన్నమేమీ కాదు. కాని తాను ఎప్పటికైనా సరే సిఎం. కావాలనుకున్నారు. అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో కల గన్నాడు. అందుకు అడుగులు వేశారు. కాలం కలిసి వస్తే ఉమ్మడిరాష్ట్రంలోనే సిఎం. కాలనుకున్నారు. కాని తెలంగాణ వస్తుంది? తాను సిఎం. కావాలని అనుకోలేదు. కాని లక్ష్యం మాత్రం సిఎం. పదవి నిర్ధేశించుకొని రాజకీయం మొదలు పెట్టారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ఆయన తన లక్ష్యం నెరవేరేది కాదు. ఆనాడే బిఆరఎస్‌లో వుంటే ఈ స్దాయి వచ్చేవారు కాదు. అలా కాలాన్ని కూడా తన వైపు తిప్ప్పుకుంటూ ఎదిగారు. తెలుగుదేశంలో ఎదిగారు. కాంగ్రెస్‌కు దారి చూపే నాయకుడయ్యారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి, గెలుపు బాద్యతలు తన భుజాన వేసుకున్నారు. చిన్న వయసులో మోయలేని భారం ఎత్తుకున్నారు. అందుకు చిన్నప్ప్పుడు కష్టపడితే పెద్దయ్యాక సుఖపడతారనే సామెతను ఇలా కూడా రాజకీయాల్లో సిఎం.రేవంత్‌రెడ్డి నిజం చేశారు. ఆదర్శంగా నిలిచారు. అయితే ఇప్ప్పుడు ఆయన మరో లక్ష్యం వైపు చూస్తున్నట్లున్నారు. గతంలో ఓ సందర్భంలో స్వయంగా సిఎం. రేవంత్‌రెడ్డి చెప్పారు. తాను ఏం చేయాలనుకునే పని, చెపట్టాలనుకునే కర్తవ్యం గురించి ఐదు సంవత్సరాల ముందే ప్రణాళిక రచించి పెట్టుకుంటారు. అలా ప్రణాళికా బద్దమైన భవిష్యత్తును ఆయన తీర్చిదిద్దుకుంటూ వస్తున్నారు. రాజకీయాల్లో అనుకోని సంఘటనలు అనేకం ఎదురౌతుంటాయి. ఎదురుతెన్నులు ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తాయి. అయినా వాటిని ఎదిరించి నిలబడినప్ప్పుడే గెలుపు ముంగిట్లో వాలుతుంది. 2018 ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి తన సొంత కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయారు. బిఆరఎస్ వాళ్లు ఇక రేవంత్‌రెడ్డి పని అయిపోయిందని సంకలు గుద్దుకున్నారు. కాని పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే, పది అడుగుల దూరం పంజా విసురుతుందన్న సంగతిని బిఆరఎస్ నాయకులు మర్చిపోయారు. ఒక్క ఓటమి వల్ల సిఎం. రేవంత్‌రెడ్డిలో మరింత కసి పెరిగింది. లక్ష్యం వైపు దృష్టి తీక్షణమైనమైంది. అంతే మల్కాజిగిరి ప్రజలు ఆదరించారు. తెలంగాణలో ఆ సమయంలో ప్రశ్నించే గొంతు ఒక్క రేవంత్‌రెడ్డే అని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కడే పూర్తి స్ధాయి ప్రతిపక్ష పాత్ర పోషించారు. కేసిఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ప్రతిపక్షాలను ఐక్యం చేయగలిగారు. సమాజంలోని వ్యవస్థలన్నింటికీ ఏక తాటి మీదకు తేగలిగారు. అటు విద్యార్ది లోకం, ఇటు నిరుద్యోగ సమాజం, ఉద్యమకారులను అందర్ని కలుపుకున్నారు. సమాజంలో బిఆరఎస్‌పై పోరాటం చేశారు. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ మీద ఆలోచనలు మళ్లేలా చేశారు. అలా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆలోచనల్లోకి సిఎం.రేవంత్‌రెడ్డి చేరిపోయారు. కాంగ్రెస్‌పార్టీ అధిష్టానానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పార్టీని గెలిపించి సిఎం. అయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తి స్ధాయిలో తన అదుపాజ్ఞలో పెట్టుకోగలిగారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ పార్టీయే అదికారంలో వుంటుందని చెబుతూ వచ్చారు. ఆ పదేళ్లు తానే సిఎంగా వుంటానని చెబుతూ వస్తున్నారు. అలా ఇప్పటికి కొన్ని వందల సార్లు చెప్పారు. అలా పార్టీని కూడా ట్యూన్ చేసుకుంటూ వస్తున్నారు. 2034 వరకు తానే సిఎంగా వుంటానని చెబుతూ వస్తున్నారు. తాజాగా కూడా మరోసారి ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఎందుకంటే సిఎం. రేవంత్‌రెడ్డి చెప్పిన తర్వాత కాదనే నాయకుడు ఎవరూలేరు. ఎందుకంటే పార్టీని మÖడేళ్లపాటు కష్టపడి నడిపి, ప్రజలను ఒప్పించి, మెప్పించి గెలిపించిన ఏకైక నాయకుడు సిఎం. రేవంత్ రెడ్డి. ఈ విషయం పార్టీ అధిష్టానానికి తెలుసు. అందుకే ఆయనకు అంత ప్రాధాన్యత పార్టీలో దొరుతోంది. పార్టీ పెద్దల ఆశీస్సులు లేకుండా సిఎం. రేవంత్‌రెడ్డి ఆ మాట చెప్పలేరు. ఇక్కడ విశేషమేమిటంటే గత అరవై సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో ఏ నాయకుడు తానే సిఎం. అని చెప్పలేదు. ఏ ఎన్నిక ముందు కూడా ఆ మాట చెప్పలేదు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం. అయిన తర్వాత వరుసగా పదేళ్లు నేనే సిఎం. అని ఏ ఒక్కరు చెప్పలేదు. ఎంతో బలమైన నాయకులుగా పేరున్న వారు కూడా ఉమ్మడి రాష్ట్రంలో అలా చెప్పి గెలిచింది లేదు. గెలిచినా ఐదేళ్లు పూర్తి స్ధాయి సిఎం. పదవి నిర్వహించిన వారు లేరు. కేవలం ఒక్క వైఎస్ మాత్రమే ఐదేళ్లు పరిపాలన చేశారు. కాని ఆయన కూడా నేనే సిఎం. అని ఏనాడు చెప్పలేదు. పార్టీ నిర్ణయం శిరసావహసిస్తాను. అని మాత్రమే చెప్పేవారు. కాని ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే చెప్పలగుతున్నారు. అయితే సిఎం.రేవంత్ రెడ్డి ఈ పదేళ్లపాటు తానే పరిపాలించి, 2034లో కాంగ్రెస్‌ను మÖడో సారి అధికారంలోకి తీసుకొస్తానని కూడా చెబుతున్నారు. ఆ గెలుపు తర్వాత తాను డిల్లీ రాజకీయాల్లోకి వెళ్తానని అంటున్నారు. అంటే జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తానని చెబుతున్నారు. కేంద్రంలో ఎంత పెద్ద కీలకమైన మంత్రి పదవి నిర్వహించినా, ఒక రాష్ట్రానికి సిఎం. కావాలన్న కోరిక అందరికీ వుంటుంది. ఒక రాష్ట్రానికి సిఎం.గా సేవలందించిన నాయకులకు జాతీయ స్దాయిలో మంత్రి పదవి అనేది చాలా చిన్న విషయం. అందువల్ల ఆయన జాతీయ స్దాయి రాజకీయాలు అంటేనే ఇక అతిపెద్ద పదవి నిర్వహిస్తానని చెప్పకనే చెప్పారు. పదేళ్ల పాటు తెలంగాణకు సిఎంగా వుంటాను. తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ది చేస్తారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను. కాలాన్ని తన వైపు తిప్ప్పుకొని ప్రదాని అవుతాను. దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తానని చెప్పకనే చెప్పారు. అలా ఆశించడం తప్ప్పుకాదు. ఆలోచించడం అసలే తప్ప్పు కాదు. అందుకే ఏ రంగం ఎంచుకున్నా ఆ రంగంలో అత్యున్న స్ధాయికి చేరుకోవాలనుకోవడం అతి విశ్వాసం కాకుండా, రేవంత్‌లా ఆత్మవిశ్వాసంతో సాగితే ఏదైనా సాద్యమే. ఎంత పెద్ద పదవైనా సొంతమే!! 

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version