# ఏజెన్సీ ప్రాంత రైతులకు 24 గంటల 3 ఫేస్ కరెంటు..
# మాయమాటలతో మోసం చేసే నైజం కాదు.
# నల్లబెల్లి మండలంలో ఎమ్మెల్యే పెద్ది ప్రచారం ప్రారంభం
# వేడుకల ప్రారంభమైన పెద్ది ఎన్నికల ప్రచార యాత్ర..
# నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తా..
# గ్రామ గ్రామాన బతుకమ్మలు,బోనాలతో మహిళలు ఘన స్వాగతం.
నల్లబెల్లి,నేటిధాత్రి :
అటవీ హక్కుల చట్టంలో భాగంగా ఏజెన్సీ గిరిజన ప్రజలకు ఆర్ఓఆర్ఐ పట్టాలు సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో అందాయని వాటికి ప్రభుత్వం నుండి వచ్చే బ్యాంకు రుణాల బాధ్యత తనదేనని నర్సంపేట నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నర్సంపేట బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు.
జననేతకు అడుగడుగునా అపూర్వ స్వాగతం పలుకుతూ జయహో పెద్దన్న అంటూ నినాదాలు చేశారు.మచ్చలేని మనిషిని చూసేందుకు, కలిసేందుకు ఆసక్తి చూపిన జనం పలువురు కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఇవీ నర్సంపేట బిఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి తొలి రోజు పాదయాత్రలో కనిపించిన దృశ్యాలు ఎంతగానో అలరించాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ప్రజలు వెన్నంటి రాగా మూడు చెక్కలపల్లి దుర్గమ్మ తల్లి దేవాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన సతీమణి జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నతో పాటు ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అదే మూడుచెక్కల పల్లె గ్రామం నుండి ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు. పలు గ్రామాలలో ఇంటింటికీ తిరుగుతూ అందరినీ పలకరించారు.గ్రామ గ్రామాన మహిళలు బతకమ్మలు,బోనాలతో ఘన స్వాగతాలు పలికారు.కొండాపూర్ గ్రామంలో మహిళలు చేసిన గుర్తు గుర్తుంచుకో రామక్క కారు గుర్తుంచుకో రామాక్క అనే పాటకు నృత్యం చేయగా అక్కడి గ్రామస్థులు,పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిని ఎంతగానో అలరించింది.పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలను ద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాటిచ్చారు. మాయమాటలతో మోసం చేసే నైజం కాదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వం తనదని పేర్కొన్నారు.
.నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల మరింత అభివృద్ధి చేసే బాధ్యత వహిస్తానని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా ఓడిపోగానే తట్టా బుట్టా సదురుకొని పోయే వ్యక్తిని కాదని ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశానని గతంలో ఓడిపోయిన సమయంలో కూడా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం మేడపెళ్లి రాంపూర్ జంట గ్రామాలకు సీఎం కేసీఆర్ ను పిలిపించి అభివృద్ధి కోసం నిధులు ఇప్పించి అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. తర్వాత జనాలు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని అదే గ్రామంలో నర్సంపేట నియోజకవర్గాన్ని కూడా ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి చేశానని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత రైతులకు 24 గంటల 3 ఫేస్ కరెంటును అందించేందుకు 2 కోట్ల 20 లక్షలతో సబ్ స్టేషన్ కొండాపూర్ గ్రామంలో మంజూరు అయ్యిందని తెలిపారు.ఎమ్మెల్యే
మరోసారి కెసిఆర్ నాకే అవకాశం ఇచ్చారని కాగా మీపై నమ్మకంతో మళ్లీ మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదం కోరుతున్నానని,మరల మీరు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నర్సంపేట నియోజకవర్గం అంటే గుర్తింపు ఉండేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమాలలో మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి ఎంపీపీ ఉడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, నర్సంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరరావు, ఎన్నికల ఇంచార్జ్ కన్వీనర్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, మాజీ జెడ్పిటిసి హరినాథ్ సింగ్, సర్పంచులు, ఎంపీటీసీలు, క్లస్టర్ ఇన్చార్జిలు,మండల నాయకులు, కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.