ఈనెల 28న సికింద్రాబాద్ జింఖానా మైదానంలో హునార్ మహోత్సవం ప్రారంభం

హైదరాబాద్ 26 మార్చి 2024 : ఈనెల 28న సికింద్రాబాద్ జింఖానా మైదానంలో హూనార్ క్రాఫ్ట్, క్యూజన్ మరియు మ్యూజిక్ మహోత్సవం ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.. 28వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు ఈ మహోత్సవంలో దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుండి ఎగుమతి చేసిన హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ ప్రత్యేకమైన వివిధ రకాల ఉత్పత్తుల తో పాటు వివిధ దేశాలు రాష్ట్రాలకు చెందిన తిను బండారాలను వంటకాలను కూడా ఈ మహోత్సవంలో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళా ప్రదర్శన కూడా ఈ మహోత్సవంలో ప్రదర్శించనున్నట్లు వారు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని ఈ ప్రదర్శనకు వచ్చే వారందరికీ ఉచిత ప్రవేశం ఉంటుందని వారు తెలిపారు ప్రతి ఒక్కరు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version