శ్రీనివాస్ పోతుగల్లు మాజీ సర్పంచ్ రేణుకుంట్ల చందర్ పడిదెల నర్సింగరావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ పరిశీలకులు , శ్రీమతి సుజాత పాల్ ,భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని లక్ష మెజార్టీతో గెలిపించాలని ప్రతి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ శాఖ అధ్యక్షులకు ముఖ్య కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు , చిట్యాల బ్లాక్ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఎర్రబెల్లి పున్నం చందర్రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుతోట కుమారస్వామి తక్కల్లపల్లి రాజు , మండల నాయకులు, బండారి విజయ్ కుమార్, మహమ్మద్ రఫీ , బండారి కొమురయ్య ,మొగుళ్ళపల్లి టౌన్ అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో వీరి ఇరువురు ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ఏ గ్రామాలలో ఎక్కువ ఓట్లు తీసుకొస్తారు ఆ విలేజ్ని నేను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని అలాగే రానున్న స్థానిక ఎలక్షన్లో ఎవరైతే కష్టపడి పార్టీకి పని చేస్తారో వారికే ఎంపీపీ ,జడ్పిటిసి, ఎంపీటీసీలుగా , సర్పంచులుగా నిలబెట్టి గెలిపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను అన్నారు
అనంతరం భారత రాష్ట్ర సమితి నుండి అలాగే భారతీయ జనతా పార్టీ నుండి మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 100 మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరినారు
