ఏఐటియూసీ ప్రధాన కార్యదర్శి
కొరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
పోరాటయోధుల ఆశయాలను కొనసాగిస్తూ మేడే స్ఫూర్తితో కార్మికులు పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో 138వ మే డే వేడుకలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్ కుమార్ పాల్గొని మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ కార్మిక హక్కులను కాలరాస్తూ ప్రైవేటు విధానాన్ని అమలు చేస్తున్నాడని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్య పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
138వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఏఐటీయూసీ కొమురయ్య భవనం నుండి 6 ఇంక్లైన్ మీదుగా రాజీవ్ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దీంతో పట్టణమంతా ఎర్రజెండాలతో ఎరుపెక్కి పోయింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, కొరిమి రాజ్ కుమార్, భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శిలు గురిజేపల్లి సుధాకర్ రెడ్డి, గంగసరపు శ్రీనివాస్, ఎం విజేందర్, ఎండి ఆసిఫ్ పాషా, పట్టణ కార్యదర్శి ప్రవీణ్, శ్రీకాంత్, జోసెఫ్, బ్రాంచ్ నాయకులు తాళ్ల పోశం, అన్ని జనుల ఫిట్ సెక్రటరీలు మరియు కార్మికులు పాల్గొన్నారు.