తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ సతీమణి మాధవి ప్రచారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ లక్ష్మీపూర్ గ్రామంలో బి ఆర్ఎస్వి. నాయకులు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో కార్నర్ సమావేశం లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ సతీమణి మాధవి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత వినోద్ కుమార్ నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చుతూ ఉన్నారని ఆయన గెలిచిన తర్వాత కరీంనగర్ కి ఎంతో అభివృద్ధి చేశారని స్మార్ట్ సిటీ గాని కరీంనగర్ మనోహరాబాద్ రైల్వే లైను తీసుకువచ్చారని కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తారని చెప్పి ఇప్పటివరకు అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదని బండి సంజయ్ ఐదేళ్ల కాలంలో ఒక గుడి ఒక బడి కి నిధులు తేలేదని పేర్కొంటూ ఎప్పుడూ ప్రజల మనోభావాలతో రాజకీయం చేస్తారని కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు బాగా ఆలోచించి విద్యావంతుడు అయినా అభివృద్ధి చేసే నాయకుడైన వినోద్ కి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ మానస రాజు మండలఅధ్యక్షులు రాజన్న ఏఎంసి మాజీ చైర్మన్ సరస్వతి అనిత కోడి అంతయ్య జక్కుల నాగరాజు మాజీ సర్పంచులు మహేష్ జోహార్ రెడ్డి రవీందర్ బి ఆర్ఎస్. గ్రామ శాఖ అధ్యక్షులు కొండలరావు మాజీ సింగిల్ విండో చైర్మన్ సత్యనారాయణ రెడ్డి బ్రహ్మం అనంతరెడ్డి రాజిరెడ్డి బాలకృష్ణ అనిల్ కమలాకర్ శ్రీకాంత్ రాజు స్వామి సంపత్ రాజు అనిల్ మధు బాబు తదితరులు పాల్గొన్నారు

