తెలంగాణ జాగృతి పార్టీలో భారీ చేరికలు
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా భీమిని మండలం నుండి తెలంగాణ జాగృతి పార్టీలో తెలంగాణ జాగృతి మంచిర్యాల యువజన విభాగం రాజశేఖర్ ఆధ్వర్యంలో యువకులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి పార్టీకి ఆకర్షితులై ఉత్సాహంతో పార్టీలో చేరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జాగృతి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్,స్టేట్ యూత్ ప్రెసిడెంట్ రవి రాథోడ్,ఎటకారి అజయ్,రాపల్లి తిరుపతి,ఎటకారి సత్తయ్య,పెసరి వినోద్, బొగ్గుల విక్రమ్,పెసరి అంజన్న,ఎటకారి శ్రీశైలం, కారుపాకల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
