మందమర్రి, నేటిధాత్రి:-
యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన మహంత్ అర్జున్ కు మంగళవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గడ్డం శ్రీనివాస్, ఓరుగంటి సురేందర్, వేల్పుల కిరణ్, గాదే రాములు, శ్రీకాంత్, ప్రసాద్, సమత, శ్రీలత, కనుక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.