బిజెపి జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు…
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) నరేంద్ర మోడీ ని మూడో సారి ప్రధానిగా చూడాలనే లక్ష్యంతోకరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజాహిత యాత్రను విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు మండల ప్రజలకు,పార్టీ కార్యకర్తలకు,మోడీ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.ఈ నెల 28,29 తేదీలలో కమలాపూర్ మండలంలో జరగనున్న యాత్రలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఎల్కతుర్తి మండలం లోని దండేపల్లి గ్రామం మీదుగా కమలా పూర్ మండలం లోని దేశరాజ్ పల్లి గ్రామానికి బుధవారం సాయంత్రం ప్రజాహిత యాత్ర చేరుతుంది అని, దేశరాజుపల్లి,కానీపర్తి గ్రామాల్లో యాత్ర ముగించకొని రాత్రి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇంట్లో బండి సంజయ్ బస చేస్తారని,గురువారం ఉదయం 9గం.లకు కమలాపూర్ బస్ స్టాండ్ సమీపములో కార్నర్ మీటింగ్లో పాల్గొని వంగ పల్లీ,మర్రిపల్లీ గూడెం గ్రామాల ద్వారా ఇళ్ళంద కుంట మండలములోకి ప్రజాహిత యాత్ర ప్రవేశిస్తుంది అని తెలిపారు.కమలాపూర్ బస్ స్టాండ్ వద్ద జరిగే కార్నర్ మీటింగ్ లో వెలాధిగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.